టోర్నీలతో తీరిక లేకుండా.. విజయాలతో సావాసం చేసే మన ఛాంపియన్లు.. కరోనా కారణంగా ఇంట్లోనే ఉన్నారు. దేశమంతా లాక్‌డౌన్ ఉండటం వల్ల బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ఖాళీ సమయంలో కుటుంబంతో ఆనందంగా గడుపుతూ, ఇంటి పనుల్లో భాగమవుతున్నారు. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్, బ్యాడ్మింటన్ తార సైనా నెహ్వాల్.. ఆ బాటలోనే సాగుతూ చీపుర్లు చేతబట్టి ఇంటి పరిసరాలను శుభ్రం చేయడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
చీపురు పట్టిన భారత ఛాంపియన్లు - సైనా నెహ్వాల్ మేరీ కోమ్
భారత ప్రముఖ క్రీడాకారులైన సైనా నెహ్వాల్, మేరీకోమ్లు, లాక్‌డౌన్ పరిస్థితుల వల్ల చీపురు చేతపట్టి శుభ్రం చేస్తూ కనిపించారు. ఆ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి.