91వ విజయంతో ఎఫ్1 దిగ్గజం మైకెల్ షుమాకర్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేయాలనుకున్న లూయిస్ హామిల్టన్ (మెర్సీడెజ్)కు నిరాశ తప్పలేదు. అతడి జట్టుకే చెందిన వాల్టెరి బొటాస్ రష్యన్ గ్రాండ్ ప్రిని ఎగరేసుకుపోయాడు.
![Russian GP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/bottas-vs-hamilton_2709newsroom_1601216624_783.jpg)
ఆదివారం ఫేవరెట్‌గా, పోల్ పోజిషన్ నుంచి రేసును ఆరంభించిన హామిల్టన్ రేసును మూడో స్థానంతో ముగించాడు. టైమ్ పెనాల్టీల కారణంగా అతడు దెబ్బతిన్నాడు. మ్యాక్స్ వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానం సాధించాడు. ఈ రేసులో గెలవకున్నా ఛాంపియన్‌షిప్ రేసులో హామిల్టన్ మంచి ఆధిక్యంతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సీజన్‌లో మరో ఏడు రేసులు మిగిలి ఉండగా రెండో స్థానంలో ఉన్న బొటాస్ కన్నా హామిల్టన్ 44 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు.