రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసు(Sagar Murder Case)లో అభియోగాలతో జైలు పాలైన దిగ్గజ కుస్తీ యోధుడు సుశీల్ కుమార్(Sushil Kumar).. అక్కడి భోజనశాలలో పెట్టే తిండితో సంతృప్తి చెందట్లేదు. రెజ్లింగ్‌లో కొనసాగుతున్న తనకు ప్రత్యేక ఆహారం కావాలంటూ అతను కోర్టుకు విన్నవించుకున్నాడు. ప్రొటీన్ మిల్క్‌షేక్, బలాన్నిచ్చే కొన్ని మాత్రలతో పాటు వ్యాయామ పరికరాలు కూడా తనకు అందించే ఏర్పాటు చేయాలని ఈ పిటిషన్లో అతను పేర్కొన్నాడు.
భద్రత కారణాల రీత్యా జైల్లో ప్రత్యేక గదిలో ఉంటున్న సుశీల్.. క్యాంటీన్లో అందరితో పాటే రొట్టెలు, అన్నం, పప్పు తింటున్నాడు. అయితే రెజ్లర్‌నైన తాను దృఢమైన శరీరాకృతిని నిలుపుకోవాలంటే ఇవి సరిపోవని.. ఇంకా బలమైన ఆహారం తీసుకోవడం సహా వ్యాయామం చేయాల్సిందే అని, కాబట్టి తనకు అవసరమైనవి అందజేయాలని అతను కోరాడు.
ఇదీ చూడండి.. Tokyo Olympics: అథ్లెట్లకు 1.6 లక్షల కండోమ్‌లు