ETV Bharat / sports

ఎవరెస్ట్​ అధిరోహకురాలిని ప్రశంసించిన కిరెన్​ రిజిజు

2021కి గానూ విజయవంతంగా ఎవరెస్ట్​ శిఖరం అధిరోహించిన తాషి యాంగ్జోమ్​ను ట్విట్టర్​ వేదికగా ప్రశంసించారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరెన్ రిజిజు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ కూడా తాషికి అభినందనలు తెలిపారు.

author img

By

Published : May 15, 2021, 1:26 PM IST

Tashi Yangjom, becoming 1st Indian woman climber to scale Mt Everest in 2021
తాషి యాంగ్జోమ్​, పర్వతారోహకురాలు

2021కి గానూ ఎవరెస్ట్​ శిఖరం అధిరోహించిన పర్వతారోహకురాలిగా తాషి యాంగ్జోమ్​ నిలిచింది. ఆమెను కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరెన్​ రిజిజుతో పాటు అరుణాచల్​ ప్రదేశ్ సీఎం పెమా ఖండు అభినందించారు. ఆమె అరుణాచల్​ ప్రదేశ్​లోని దిరాంగ్​లో ఉన్న పర్వతారోహణ, అనుబంధ క్రీడల జాతీయ కేంద్రం (ఎన్​ఐఎంఏఎస్​)లో శిక్షణ తీసుకుంది.

"ఈ ఏడాదికి గానూ ఎవరెస్ట్ పర్వతం ఎక్కిన తొలి మహిళగా నిలిచిన తాషి యాంగ్జోమ్​కు.. నా హృదయపూర్వక అభినందనలు. ఆమె దిరాంగ్​ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందింది" అని రిజిజు ట్విట్టర్​లో ప్రశంసించారు.

  • I extend my heartiest congratulations to Ms Tashi Yangjom from Arunachal Pradesh for scaling Mt. Everest & becoming the first Indian woman climber to Everest in 2021.
    She was trained at National Institute of Mountaineering & Allied Sports (NIMAS) in Dirang, Arunachal Pradesh. pic.twitter.com/ToD39KHyxL

    — Kiren Rijiju (@KirenRijiju) May 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దిరాంగ్​ శిక్షణ కేంద్రంలో తాషి అత్యుత్తమ నైపుణ్యాలు సంపాదించిందని అరుణాచల్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రి తెలిపారు. ఈ శిక్షణ కేంద్రం నుంచి ఎవరెస్ట్​ను అధిరోహించిన తొమ్మిదో పర్వతారోహకురాలు తాషి అని ఆయన పేర్కొన్నారు.

"విజయవంతంగా ఎవరెస్ట్​ ఎక్కిన యాంగ్జోమ్​కు అభినందనలు. ఈ సీజన్​లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు తాషి. శిక్షణ కేంద్రంలో రోజువారి శిక్షణ ఆమెకు చాలా ఉపయోగపడింది. ఎన్​ఐఎంఏఎస్​లో శిక్షణ పొంది ఎవరెస్ట్​ ఎక్కిన తొమ్మిదో వ్యక్తి యాంగ్జోమ్​" అని ఖండూ ట్వీట్ చేశారు.

పర్వతారోహకులకు మంచి మద్దతు ప్రకటిస్తున్న సీఎం ఖండూకు ధన్యవాదాలు తెలిపింది ఎన్​ఐఎంఏఎస్.

ఇదీ చదవండి: ఒలింపిక్స్​పై అనుమానాలు.. రద్దు తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.