ETV Bharat / sports

ఒలింపిక్స్​కు మరో ఇద్దరు మహిళా రెజర్లు అర్హత

ఆసియా క్వాలిఫయర్స్​లో అదరగొట్టిన భారత మహిళా రెజ్లర్లు అన్షు, సోనమ్.. టోక్యో ఒలింపిక్స్​ బెర్తులను ఖరారు చేసుకున్నారు. వీరికి కేంద్రమంత్రి కిరణ్ రిజిజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.

Anshu, Sonam for sealing Tokyo Olympics berths
ఒలింపిక్స్​కు మరో ఇద్దరు మహిళా రెజర్లు
author img

By

Published : Apr 10, 2021, 5:22 PM IST

భారత మహిళ రెజర్లు అన్షు మాలిక్(57 కిలోలు), సోనమ్ మాలిక్(62 కిలోలు) ఒలింపిక్స్​ బెర్త్​లు సాధించారు. ఈ విషయమై కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్​ వేదికగా వారిద్దరినీ అభినందించారు. క్వాలిఫయింగ్​ మ్యాచ్​లో అద్భుత ప్రదర్శన చేశారని, దేశం తరఫున ఒలింపిక్స్​ పాల్గొంటున్న సందర్భంగా వారికి ఆల్​ ది బెస్ట్ చెప్పారు.

కజకస్థాన్​లో జరుగుతున్న ఆసియా ఒలింపిక్స్​ క్వాలిఫయర్స్​లో 19 ఏళ్ల అన్షు.. సెమీస్​లో అక్మెదేవాను ఓడించి ఒలింపిక్స్​కు అర్హత సాధించింది. మరో మ్యాచ్​లో సోనమ్.. అయాలిమ్ కస్సిమోవాపై గెలిచి టోక్యో బెర్త్​ను ఖరారు చేసుకుంది. ఈ ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఒలింపిక్స్ జరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.