ETV Bharat / sports

సింధు షాకింగ్ నిర్ణయం.. కోచ్ పార్క్‌తో తెగతెంపులు.. కొత్తోడి కోసం వెతుకులాట! - కోచ్ పార్క్‌తో సింధు తెగతెంపులు

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన కోచ్ పార్క్‌తో తెగతెంపులు చేసుకుంది. ప్రస్తుతం కొత్త కోచ్ కోసం వెతుకుతోంది. ఆ వివరాలు..

PV Sindhu coach
సింధు షాకింగ్ నిర్ణయం.. కోచ్ పార్క్‌తో తెగతెంపులు.. కొత్తోడి కోసం వెతుకులాట!
author img

By

Published : Feb 24, 2023, 5:51 PM IST

Updated : Feb 24, 2023, 6:54 PM IST

రెండుసార్లు ఒలింపిక్స్ మెడల్ విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన కోచ్ పార్క్ టే సాంగ్​తో తెగతెంపులు చేసుకుంది. నాలుగేళ్ల పాటు పార్క్ కోచింగ్​లో శిక్షణ పొందిన ఆమె.. ప్రస్తుతం కొత్త కోచ్ కోసం వెతుకులాటలో పడింది. ఈ విషయాన్ని పార్క్ స్పష్టం చేశాడు. ఈ ఏడాది సీజన్​ గొప్పగా ప్రారంభించని నేపథ్యంలో సింధు నిర్ణయాన్ని గౌరవిస్తూ తానే స్వయంగా తప్పుకుంటున్నట్లు తెలిపాడు.

2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ నుంచి పార్క్ టే సాంగ్ - సింధు ప్రయాణం మొదలైంది. మొదట్లో అతడిని మెన్స్ సింగిల్స్ కోచ్​గా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నియమించినా.. తర్వాత సింధు పర్సనల్​ కోచ్​గా మారాడు. పార్క్ కోచింగ్ శిక్షణలో సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ స్వర్ణం, టోక్యో ఒలింపిక్స్​లో కాంస్య పతకం, కామన్వెల్త్ గేమ్స్​లో గోల్డ్​ మెడల్​ను ముద్దాడింది. కానీ కొంత కాలంగా సింధు వరుస పరాజయాలను అందుకుంటోంది. గతేడాది మడమ గాయం కారణంగా చాలా కాలం పాటు బ్యాడ్మింటన్ కోర్టుకు దూరంగా ఉన్న ఆమె.. టోక్యోలో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్​లోనూ పాల్గొనలేదు. ఈ ఏడాది మలేషియా ఓపెన్​, ఇండియా ఓపెన్​లలో తొలి రౌండ్లలోనే వెనుదిరిగింది. బ్యాడ్మింటన్ ఏషియా మిక్స్‌డ్ టీమ్ ఛాంపియన్‌షిప్​లోనూ సెమీఫైనల్లో ఓడిపోయింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా.. సింధు కోచ్​గా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు చెబుతూ పార్క్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. సింధు వైఫల్యాలకు కోచ్​గా తానే బాధ్యత వహిస్తున్నట్లు స్పష్టం చేశాడు. సింధు మార్పు కోసం ఎదురు చూస్తోందని, ఓ కొత్త కోచ్ వేటలో ఉన్నట్లు తెలిపాడు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ తాను తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: కొత్త అల్ట్రా లగ్జరీ విల్లా కొన్న విరుష్క.. ఎన్ని కోట్లంటే?

Last Updated : Feb 24, 2023, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.