ప్రో కబడ్డీ లీగ్ ఏడో సీజన్ ప్రారంభ తేదీ ఖరారైంది. జులై 19 నుంచి అక్టోబర్ 9 వరకు లీగ్ జరగనుంది. పండుగ సీజన్‌ని దృష్టిలో ఉంచుకొని ఈ తేదీని ఖరారు చేసినట్లు ప్రో కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తెలిపారు.
"ఆరో సీజన్ మాదిరి అక్టోబరులో పోటీలు నిర్వహిద్దామని అనుకున్నాం. పండుగ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని జులై మాసమైతే అనుగుణంగా ఉంటుందని తేదీ మార్చాం. 2020లో జరిగే ఎనిమిదో సీజన్ కూడా జులైలోనే ఉంటుంది" -అనుపమ్ గోస్వామి, పీకేఎల్ కమిషనర్
లీగ్ కోసం13 దేశాలకు చెందిన 440 మంది ఆటగాళ్లకు వేలం సోమవారం జరగనుంది. 388 మంది దేశీయ ఆటగాళ్లుండగా.. 53 మంది విదేశీయులున్నారు. 12 ఫ్రాంఛైజీలు వేలంలో పాల్గొననున్నాయి. ఒక్కో జట్టు ఆటగాళ్లను కొనుక్కునేందుకు గరిష్ఠంగా రూ. 4.4 కోట్లు ఖర్చుపెట్టవచ్చు.