ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్ విజేతగా దబంగ్ దిల్లీ అవతరించింది. పట్నా పైరేట్స్, దబంగ్ దిల్లీ జట్ల మధ్య జరిగిన తుది పోరులో గెలిచిన దిల్లీ.. తొలిసారి ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో 37-36 తేడాతో దిల్లీ జట్టు గెలుపొందింది. దీంతో మూడుసార్లు టైటిల్ విజేత పట్నా పైరేట్స్ ఒక పాయింట్ తేడాతో ఓటమి పాలైంది.
దిల్లీ జట్టులో విజయ్ 14, నవీన్ కుమార్ 13 పాయింట్లు సాధించగా.. సందీప్ నర్వాల్, మంజీత్ చిల్లర్ చెరో రెండు పాయింట్లు రాబట్టారు. పట్నా జట్టులో సచిన్ 10, గుమన్ సింగ్ 9, మహమ్మద్ రెజా 5, ప్రశాంత్ కుమార్ రెండు, నీరజ్ కుమార్, సజిన్ తలో ఒక పాయింట్ సాధించారు.