ETV Bharat / sports

ప్రపంచ నెం.1కు షాకిచ్చిన భారత యువ గ్రాండ్​మాస్టర్ - కార్లసన్​ ప్రజ్ఞానంద

Praggnanandhaa Carlsen: ఆన్​లైన్​ రాపిడ్​ చెస్​ టోర్నీ​ ఎయిర్​థింగ్స్​ మాస్టర్స్​లో భారత యువ గ్రాండ్​మాస్టర్​ ఆర్ ప్రజ్ఞానందా​.. ప్రపంచ నంబర్​ వన్​కు షాకిచ్చాడు. ఎనిమిదో రౌండ్​లో కార్ల్​సన్​ను ఓడించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

praggnanandhaa vs magnus carlsen
praggnanandhaa vs magnus carlsen
author img

By

Published : Feb 21, 2022, 3:11 PM IST

Praggnanandhaa Carlsen: 16 ఏళ్ల భారత కుర్రాడు, గ్రాండ్​మాస్టర్​ ఆర్​.ప్రజ్ఞానంద రికార్డు సృష్టించాడు. ఓ ఆన్​లైన్​ రాపిడ్​ చెస్​ పోటీ​లో ప్రపంచ ఛాంపియన్​ మాగ్నస్​ కార్ల్​సన్​కు షాకిచ్చాడు. ఎయిర్​థింగ్స్​ మాస్టర్స్​లోని ఎనిమిదో రౌండ్​లో అతడిని ఓడించి ఔరా అనిపించాడు.

ఈ టోర్నీ​లో మాగ్నస్​ మూడు వరుస విజయాలకు బ్రేక్​ వేశాడు. 39 ఎత్తుల్లో నల్ల పావులతో గెలిచాడు. దీంతో ఎనిమిది రౌండ్ల తర్వాత ఎనిమిది పాయింట్లతో ఉమ్మడిగా 12వ స్థానంలో నిలిచాడు. కార్ల్​సన్​పై అతని అద్భుత విజయానికి ముందు ఆడిన ఏడు రౌండ్లలో నాలుగు పరాజయాలు, ఓ విజయం, రెండు డ్రాలు ఉన్నాయి.

ఈ టోర్నీ​లో.. కొన్నినెలల క్రితం ప్రపంచ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో కార్ల్‌సన్ చేతిలో ఓడిపోయిన రష్యాకు చెందిన ఇయాన్ నెపోమ్నియాచి 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. డింగ్ లిరెన్​, హాన్సెన్.. ఇద్దరూ 15 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇదీ చూడండి: రోహిత్‌.. తొలి కెప్టెన్​గా సరికొత్త రికార్డు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.