Praggnanandhaa Next Tournament : భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాకులో జరిగిన ఫిడే చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో మాగ్నస్ కార్ల్‌సన్‌పై ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచాడు. అయినా 18 ఏళ్ల వయసులో ప్రజ్ఞానంద పోరాడిన తీరుకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. దిగ్గజ చేసే ప్లేయర్ కార్ల్సన్తో హోరాహోరీగా పోరాడిన ప్రజ్ఞానందను అందరూ మెచ్చుకున్నారు. ఓటమి ఎదురైనా ప్రజ్ఞానంద తన సాధనను ప్రజ్ఞానంద ఆపలేదు. సోమవారం.. జర్మనీలో జరిగే చెస్ టోర్నీకి సిద్ధమవుతున్నాడు.
Praggnanandhaa VS Carlsen World Cup : గత రెండు నెలలుగా వరుసగా టోర్నీలు ఆడడం వల్ల తాను బాగా అలసిపోయానని ప్రజ్ఞానంద చెప్పాడు. విశ్రాంతి తీసుకునే సమయం కూడా లేదని అన్నాడు. సోమవారం జర్మనీలో జరిగే ఓ చెస్ టోర్నీకి సిద్ధమవుతున్నానని పేర్కొన్నాడు. 'నేను వరుసగా చెస్ టోర్నీలు ఆడుతున్నాను. అందుకే ప్రత్యర్థి ఎత్తుల గురించి ఆలోచించే సమయం తక్కువగా ఉంటుంది. ఫిడే చెస్ ప్రపంచకప్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు వెళ్తానని ఊహించలేదు. ఆ ఫైనల్లో ఓడినా అధైర్యపడలేదు.' అని ప్రజ్ఞానంద తెలిపాడు.
Praggnanandhaa Father : ప్రజ్ఞానంద చెస్ మాస్టర్‌గా ఎదగడంలో అతడి తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. ఎందుకంటే ప్రజ్ఞానంద చెస్ ఆడేందుకు అతడి తల్లిదండ్రులు చిన్నప్పటి ప్రోత్సహించి.. అండగా నిలిచారు. ఈ క్రమంలో ఫిడే చెస్ ప్రపంచకప్ ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత ప్రజ్ఞానంద తండ్రి రమేశ్ బాబు తన కుమారుడిపై ప్రశంసలు కురిపించారు. తన కుమారుడు జర్మనీ నుంచి వచ్చాక దేవాలయానికి వెళ్తామని అన్నారు. సాధారణంగా గెలిచిన తర్వాత ప్రజ్ఞానందతో కలిసి దేవాలయానికి వెళ్తామని.. పరోక్షంగా జర్మనీలో చెస్ టోర్నీలో ప్రజ్ఞానంద విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రజ్ఞానందపై ఎప్పుడూ తాము ఒత్తిడి పెట్టలేదని తెలిపారు.
Praggnanandhaa Mother : తన కుమారుడు ఫెడో చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు చేరి రజత పతకం సాధించడంపై ప్రజ్ఞానంద తల్లి నాగలక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు. తన కుమారుడి బాకు నుంచి జర్మనీకి వెళ్తారని.. అక్కడ ఓ చెస్ టోర్నీలో పాల్గొని ఆగస్టు 30న భారత్‌కు తిరిగి వస్తారని తెలిపారు. జర్మనీలో జరిగే చెస్ టోర్నీలో విజయం సాధిస్తాడనే నమ్మకం ఉందని అన్నారు.
Praggnanandhaa Chess : మనోడు ఓడినా రాజే.. అప్పుడు ఆనంద్.. ఇప్పుడు ప్రజ్ఞానంద్!