ETV Bharat / sports

Praggnanandhaa Mother : ప్రజ్ఞానంద సక్సెస్ వెనుక అమ్మ ప్రేమ.. ఫారిన్​లోనూ రసం, సాంబార్​తో భోజనం.. స్టవ్, కుక్కర్​ తీసుకెళ్లి మరీ..

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 4:18 PM IST

Updated : Aug 23, 2023, 5:12 PM IST

Praggnanandhaa Mother : ప్రస్తుతం ఎక్కడ చూసినా యంగ్​ ఛాంపియన్​ ప్రజ్ఞానంద గురించే టాపిక్​. అజర్‌బైజాన్‌లోని బాకు వేదికగా జరుగుతోన్న ఫిడే చెస్‌ ప్రపంచకప్‌ 2023లో అతని ఆట తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రజ్ఞానంద విజయం వెనకాల అతడి తల్లి కృషి ఎంతో ఉంది. ఇప్పటి వరకు ప్రజ్ఞానందను ప్రోత్సహిస్తూ వచ్చిన ఆమె.. అతడి ఆటకు ఏ మాత్రం అడ్డంకులు రానివ్వకుండా దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే ఆట కోసం విదేశాలకు వెళ్లేటప్పుడు ప్రజ్ఞానంద కోసం ఆమె ఏం తీసుకెళ్తారంటే ?

Praggnanandhaa Mother
ప్రజ్ఞానంద తల్లి

Praggnanandhaa Mother : అజర్‌బైజాన్‌లోని బాకు వేదికగా జరిగిన ఫిడే చెస్‌ ప్రపంచకప్‌ సెమీస్​లో కరువానా లాంటి మేటి చెస్‌ ప్లేయర్‌ను చిత్తు చేసిన చెస్​ మాస్టర్ ఆర్​. ప్రజ్ఞానంద. మంగళవారం జరిగిన ఫైనల్స్​లో ప్రపంచ నంబర్‌వన్‌ చెస్ ప్లేయర్ మాగ్నస్‌ కార్ల్‌సన్‌‌తో తలపడ్డాడు. అయితే ఈ మ్యాచ్​ డ్రాగా ముగిసింది. దీంతో బుధవారం ఈ ఇద్దరు మరోసారి తలపడేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే సెమీస్​లో ప్రజ్ఞానంద ఆట తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న వయసులో ఆ కుర్రవాడి ఈ మేరకు ప్రదర్శన ఇచ్చి యావత్​ ప్రపంచాన్నే తనవైపునకు చూసేలా చేశాడు. ఆ విజయోత్సాహంతో తన తల్లి ముఖం చిరునవ్వుతో నిండిపోగా.. ఆ ఆనంద క్షణాలు ఇప్పుడు యావత్​ భారత్​ సగర్వంగా చెప్పుకునేలా మారింది. అయితే ప్రజ్ఞానంద విజయంలో క్రెడిట్​లో కొంత అతడి తల్లి నాగలక్ష్మికి దక్కుతుంది.

అమ్మ చేసిన ఆ ఒక్క పని..
ప్రజ్ఞానంద సోదరి వైశాలి కూడా చెస్​ మాస్టరే. ఆమె ప్రస్తుతం మహిళల ఇంటర్నేషనల్‌ మాస్టర్​గా కొనసాగుతోంది. అయితే చిన్నప్పుడు వైశాలి టీవీతోనే ఎక్కువ సమయం కాలక్షేపం చేస్తోందని భావించిన తల్లి.. ఆమె దృష్టి మరల్చేందుకు ఓ చెస్‌ బోర్డు కొనిచ్చింది. ఇది చూసిన ప్రజ్ఞానందకు చెస్​పై ఆసక్తి కలిగింది. దీంతో ఇంట్లోనే అక్కతో ఆడుతూ ఎన్నో నేర్చుకున్నాడు. అప్పుడు అతని వయసు నాలుగేళ్లు. ఇది గమనించిన తల్లిదండ్రులు.. ప్రజ్ఞానందాను త్యాగరాజన్‌ అనే కోచ్‌ దగ్గర శిక్షణకు చేర్పించారు. ఇక స్వీయ ప్రతిభకు శిక్షణ తోడవడం వల్ల పిన్న వయసులోనే పెద్ద వాళ్ల మీద గెలుస్తూ ఆటలో రాణించాడు ప్రజ్ఞానంద .

అలా చెస్​లో రాణిస్తూ.. బాల మేధావిగా పేరు తెచ్చుకున్న ప్రజ్ఞానంద.. 10 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్‌ మాస్టర్​గా ఎదిగి ప్రపంచ చెస్‌ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుకెక్కాడు. మరో రెండేళ్లకే గ్రాండ్‌మాస్టర్​గా ఘనత సాధించాడు. దీంతో ఈ యంగ్​ ప్లేయర్​ ప్రతిభకు ఆనంద్‌ సహా ఎందరో దిగ్గజ ప్లేయర్లు ముగ్ధులయ్యారు.

  • Won the V. Geza Hetenyi Memorial Super GM Round Robin Tournament!
    Happy International Chess day Everyone!!♟️ pic.twitter.com/MOOqyvmk9U

    — Praggnanandhaa (@rpragchess) July 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆ రెండు ఆమె వెంట ఉండాల్సిందే..
Praggnanandhaa Mother : స్థానిక టోర్నీలైనా.. అంతర్జాతీయ స్థాయిలో తలపడ్డా సరే.. చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ప్రజ్ఞానందకు తన వెంట తల్లి నాగలక్ష్మి తోడు ఉండాల్సిందే. క్లాస్​లకు తీసుకెళ్లడం దగ్గర నుంచి ఇంటిని ప్రాక్టీస్ చేయడానికి అనుగుణంగా ఉండేలా చేసేంతవరకు అన్నీ ఆమె దగ్గరుండి చూసుకున్నారు. అంతే కాకుండా అతనితో పాటు విదేశాలలో జరిగే టోర్నమెంట్‌లకు వెళ్తూ ఉండేవారు. ఇక ఆ సమయంలో ప్రజ్ఞానందకు ఇంటి భోజనం దూరం కాకూడదని భావించిన తల్లి.. ఆమె వెంట ఇండక్షన్ స్టవ్​తో పాటు రైస్ కుక్కర్‌ని కూడా తీసుకెళ్తుంటారట. వాటిపై ప్రజ్ఞానంద కోసం రసం, సాంబార్​ లాంటివి వండిపెడుతారట. ఇది విన్న నెటిజన్లు ప్రజ్ఞానంద తల్లిపై ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు.

Chess FIDE World Cup 2023 Final : డ్రాగా ముగిసిన చెస్​ ఫైనల్స్​.. మరోసారి తలపడనున్న ప్రజ్ఞానంద, మాగ్నస్

'ఆ అనుభవం అమూల్యం.. వరల్డ్ ఛాంపియన్‌గా నిలవాలన్నదే నా లక్ష్యం'

Last Updated : Aug 23, 2023, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.