ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. భారత్‌కు చెందిన ఐదుగురు చెస్ క్రీడాకారులపై ప్రశంసలు కురిపించారు. వినూత్న పద్ధతిలో పీఎం కేర్స్‌కు వారు విరాళాలు సేకరించడంపై హర్షం వ్యక్తం చేశారు.
"మన చెస్ ప్లేయర్లు విశ్వనాథన్ ఆనంద్, విదిత్, హరికృష్ణ, అబిదన్, ద్రోణవల్లి హారికల వినూత్న ఆలోచన బాగుంది. వారితో ఆన్లైన్ పోటీల్లో పాల్గొన్న వ్యక్తులు అద్భుతమైన అనుభవాన్ని పొందుంటారు" -ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్
ఈ ఐదుగురు చెస్ క్రీడాకారులు.. ఆన్లైన్లో నిర్వహించిన చెస్ పోటీల్లో పాల్గొని రూ.4.5 లక్షల విరాళం సేకరించారు. అనంతరం ఆ మొత్తాన్ని పీఎం కేర్స్‌కు అందజేశారు.
భారత్‌లో ఇప్పటివరకు కరోనా వల్ల 350 మందికి పైగా మరణించారు. దాదాపు 12 వేలమంది ఈ వైరస్ బారిన పడ్డారు. రోజురోజుకు దీని తీవ్రత పెరుగుతుండటం వల్లే లాక్డౌన్లో మే 3వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.