ETV Bharat / sports

ఆనంద్ కెరీర్ మలుపులో బాలు​ పరోక్ష పాత్ర - ఎస్పీ బాలు మృతి

మాజీ చెస్​ ఛాంపియన్​ విశ్వనాథన్​ ఆనంద్​ కెరీర్​ వృద్ధిలో సింగర్​ బాలు పరోక్షంగా సహాయం చేశారు. ఈ విషయాన్ని ఆనంద్​ స్వయంగా ట్వీట్ చేశారు. బాలు మృతికి సంతాపం తెలిపారు.

SPB
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
author img

By

Published : Sep 25, 2020, 10:07 PM IST

Updated : Sep 25, 2020, 10:35 PM IST

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వ్యక్తిగతంగా ఎంతోమంది సింగర్స్​కు అండగా నిలిచారు. కానీ మాజీ ప్రపంచ చెస్​ ఛాంపియన్​, గ్రాండ్​ మాస్టర్​ విశ్వనాథన్​ ఆనంద్​ కెరీర్​ తోడ్పటులోనూ ఆయన పరోక్ష పాత్ర పోషించారని చాలా మందికి తెలియకపోవచ్చు.

శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు బాలు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే విశ్వనాథన్ ఆనంద్​ ట్విట్టర్​​ వేదికగా, బాలుతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

  • Really sad to hear about the passing away of such a great yet simple person. He was my first sponsor! He sponsored our team Chennai Colts in the national team championship in 1983. One of the nicest persons I have met. His music gave us such joy #RIPSPB

    — Viswanathan Anand (@vishy64theking) September 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"గొప్ప స్థాయిలో ఉన్నా సరే బాలు, చాలా సాదాసీదా మనిషిలా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వ్యక్తి మరణించడం చాలా బాధగా పుంది. 1983లో జరిగిన జాతీయ ఛాంపియన్​షిప్​లో మా జట్టుకు(చెన్నై కోల్ట్స్​) స్పాన్సర్​ చేసింది ఆయనే. అలా నా మొదటి స్పాన్సర్​ బాలు అయ్యారు. నేను కలిసిన అతికొద్ది మంచివాళ్లలో ఆయన ఒకరు"

విశ్వనాథన్​ ఆనంద్​, మాజీ ఛెస్​ ఛాంపియన్​

ప్రముఖ కవి ఆరుద్ర.. అప్పటి మద్రాస్​ చెస్​ అసోషియేషన్​ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలో బాలుర చెస్​ జట్టును నేషనల్​ ఛాంపియన్​షిప్​కు తీసుకెళ్లేందుకు నిధుల కొరత ఏర్పడటం వల్ల బాలుతో మాట్లాడారు ఆరుద్ర. విషయం తెలుసుకున్న వెంటనే బాలు చెక్​ రాసిచ్చారు.

Last Updated : Sep 25, 2020, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.