టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న భారత అథ్లెట్ల కోసం కొన్ని వెసులుబాట్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రీడల్లో పాల్గొనే ప్లేయర్లకు ఈ నెల చివరికల్లా ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని భావిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజుజు పలు సూచనలు చేశారు.
"జాతీయ క్యాంపుల్లో దశలవారీగా శిక్షణ ప్రారంభించాలని అనుకుంటున్నాం. తొలుత ఎన్ఐఎస్ పటియాలా, సాయ్ బెంగళూరు కేంద్రాలను ప్రారంభిస్తాం. ఈ నెల చివరకల్లా వీటికి సంబంధించిన ప్లాన్ సిద్ధమవుతుంది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వారికి ప్రత్యేత తరగతులు నిర్వహిస్తాం. ఆటగాళ్లకు షరతులతో కూడిన ప్రాక్టీసుకు అనుమతులు ఇస్తాం" -కిరణ్ రిజుజు, కేంద్ర క్రీడా మంత్రి
భారత్‌తో తొలుత మే 3వరకు లాక్డౌన్ విధించారు. కరోనా తీవ్రత పెరుగుతుండటం వల్ల దానిని మరో రెండు వారాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వైరస్ వల్ల ఇక్కడ ఇప్పటికే 1200 మందికి పైగా మరణించగా,13 వేల మంది దీని బారిన పడ్డారు.