భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బత్రా ఇంట్లో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ విషయాన్ని ఆయనే ఓ ప్రకటనలో స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే నెగిటివ్ వచ్చిన వారికి వచ్చే వారం మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు.
నరీందర్ బత్రా ఇంటిలో తొలుత ఆయన తండ్రికి కరోనా సోకింది. ఆ తర్వాత ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, అటెండర్ ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో మిగతా కుటుంబసభ్యులు జూన్ 26 వరకు హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు.
ఇవీ చదవండి: