ఒలింపిక్స్‌కు(Tokyo Olympics) సర్వం సిద్ధమైంది! అత్యయిక స్థితిలోనే మంగళవారం ఒలింపిక్స్ గ్రామాన్ని తెరిచారు. ఎంతో ఘనంగా జరపాల్సిన ఈ వేడుక కరోనా కారణంగా సాదాసీదాగా మారింది. జులై 23 నుంచి మెగా క్రీడలు ఆరంభంకానున్నాయి.
క్రీడా గ్రామంలో ప్రతి రోజూ క్రీడాకారులకు కొవిడ్ పరీక్షలు చేస్తారు. ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు రెండుసార్లు పరీక్షలు ఉంటాయి. టీకా వేయించుకున్నప్పటికీ గ్రామంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించేలా, చేతులు కడుక్కోవడం, కిటికీలు తెరిచేలా పదేపదే సూచనలు చేస్తారు.
టోక్యో ఒలింపిక్స్‌కు దాదాపుగా 11వేల మంది, పారాలింపిక్స్‌కు 4,400 మంది క్రీడాకారులు రానున్నారు. పారాలింపిక్స్ ఆగస్టు 24 నుంచి మొదలవుతాయి. క్రీడాగ్రామంలోకి వస్తున్న అథ్లెట్లలో 80% మందికి వ్యాక్సినేషన్ జరిగిందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తెలిపింది.
ఇదీ చూడండి: షూస్ లేకుండానే పోటీలకు.. ఒలింపిక్స్‌కు అర్హత