అత్యంత ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి.. మరికొద్ది రోజులే మిగిలుంది. అయితే ఈ మెగాక్రీడలకు సంబంధించిన ఎన్నో అద్భుత, ఆసక్తికర విషయాలు ఉన్నాయి. 1904లో అలాంటి అద్భుతాలు కొన్ని నమోదయ్యాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?
1904 ఒలింపిక్స్ విశేషాలు
- ఐరోపా కాకుండా మరో దేశంలో జరిగిన మొట్టమొదటి ఒలింపిక్స్ ఇవి. యూఎస్ఏలో సెయింట్ లూసియాలో నిర్వహించారు.
- ఈ ఒలింపిక్స్‌తోనే మూడు మెడల్స్(బంగారం, రజతం, కాంస్యం) విధానాన్ని ప్రవేశపెట్టారు.
- బాక్సింగ్, డంబెల్స్, ఫ్రీస్టైల్ రెజ్లింగ్, డెకథ్లాన్ పోటీలను తొలిసారిగా తీసుకొచ్చారు.
- రైలు ప్రమాదంలో కాలు కోల్పోయిన అమెరికన్ జిమ్నాస్ట్ జార్జ్ ఐసర్.. కృత్రిమ కాలితో బరిలోకి దిగాడు. ఆరు పతకాలు సాధించాడు. అందులో మూడు స్వర్ణాలు ఉండటం విశేషం.
- ఐరోపాలో అనిశ్చితి, రూసో-జపనీస్ యుద్ధ నేపథ్యంలో కొంతమంది అథ్లెట్లు ఈ ఒలింపిక్స్‌కు రాలేకపోయారు.
- 239 పతకాలు గెల్చుకున్న యూఎస్ఏ బృందం.. ఓ ఒలింపిక్స్‌లో ఎక్కువ మెడల్స్ సొంతం చేసుకున్న దేశంగా నిలిచింది.
- మారథాన్ పోటీల్లో పాల్గొన్న అథ్లెట్లు.. గతుకుల రోడ్డుపైనే పరుగు పెట్టారు. పైన ఎండ, కింద ధూళితో ఇబ్బందులు పడ్డారు.
- దక్షిణాఫ్రికా తొలిసారి ఈ ఒలింపిక్స్‌తోనే బరిలో నిలిచింది. ఈ జట్టులో ఓ రన్నర్‌ను రేసు మధ్యలో కుక్కలు వెంబడించాయి.
ఇవీ చదవండి: