Ravi Kumar Dahiya: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. రెజ్లింగ్‌లో పతకాల పంట పండిస్తున్నారు కుస్తీ వీరులు. ఇప్పటికే ముగ్గురు భారత రెజ్లర్లు బజరంగ్ పునియా, దీపక్ పునియా, సాక్షి మాలిక్ గోల్డ్ మెడల్స్ సాధించగా.. శనివారం భారత్‌ను మరో నాలుగు స్వర్ణాలు వరించాయి. పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగంలో రవి దహియా, 74 కిలోల విభాగంలో నవీన్ బంగారు పతకం సాధించారు. ఫైనల్లో నైజీరియాకు చెందిన వెల్సన్పై రవి 10-0 తేడాతో టెక్నికల్ సుపిరియారిటీ కింద విజేతగా నిలిచాడు. రవి దహియా 3 సార్లు ఆసియా ఛాంపియన్‌గా నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్‌లోనూ రజత పతకం సాధించాడు. ఆడిన తొలిసారే కామన్వెల్త్ క్రీడల్లో బంగారం పట్టాడు రవి. మరోవైపు నవీన్ పాకిస్థాన్‌కు చెందిన మహమ్మద్ తాహిర్పై 9-0 తేడాతో ఘన విజయం సాధించాడు. 97 కిలోల విభాగంలోనూ భారత్‌ను గోల్డ్ వరించింది. పాకిస్థాన్‌కు చెందిన తాయబ్ రజాను దీపక్ నెహ్రా చిత్తుగా ఓడించాడు.
మహిళల రెజ్లింగ్‌లో కూడా భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. 53 కేజీల విభాగం ఫైనల్లో వినేశ్ ఫొగాట్ గెలుపొందింది. శ్రీలంక రెజ్లర్‌ను చిత్తుగా ఓడించి బంగారం పతకాన్ని ముద్దాడింది. మదురవలగే డాన్‌పై విజయం సాధించింది. రెజ్లింగ్‌లో భారత్‌కు ఇది ఐదో స్వర్ణం కావడం విశేషం. ఫొగాట్‌కు కామన్వెల్త్ గేమ్స్‌లో ఇది వరుసగా మూడో పసిడి పతకం. ఇలా కామన్వెల్త్ గేమ్స్‌లో వరుసగా మూడో గోల్డ్‌లు సాధించిన తొలి భారత మహిళ కావడం విశేషం. అంతకుముందు ఆసియా క్రీడల్లోనూ వినేశ్‌కు గోల్డ్ ఉంది.
అంతకుముందు మహిళల 50 కేజీల విభాగంలో పూజా గహ్లోత్ కాంస్యం నెగ్గింది. స్కాట్లాండ్ రెజ్లర్‌పై టెక్నికల్ సుపీరియారిటీతో (12-2) గెలుపొందింది. పూజా అండర్-23 వరల్డ్ ఛాంపియన్ షిప్స్‌లో సిల్వర్ మెడలిస్ట్.