ETV Bharat / sports

రెజ్లర్‌ సుశీల్‌కు బిగుస్తున్న ఉచ్చు.. హత్య, హత్యాయత్నం కింద అభియోగాలు - ఒలింపిక్​ మెడలిస్ట్​ హత్య కేసు

హత్య కేసులో అరెస్టయిన ఒలింపిక్‌ విజేత రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌పై దిల్లీ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. హత్య, హత్యాయత్నంతో పాటు పలు అభియోగాలను మోపింది.

సుశీల్‌ కుమార్‌
sushil-kumar
author img

By

Published : Oct 12, 2022, 8:13 PM IST

జూనియర్‌ రెజ్లర్‌ హత్య కేసులో అరెస్టయిన ఒలింపిక్‌ పతక విజేత‌, సీనియర్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సుశీల్‌పై దిల్లీ కోర్టు బుధవారం అభియోగాలు నమోదు చేసింది. హత్య, హత్యాయత్నం, దౌర్జన్యంతోపాటు చట్టవిరుద్ధమైన సమావేశం తదితర అభియోగాలను మోపింది. సుశీల్‌తోపాటు మరో 17 మందిపైనా అభియోగాలు ఖరారు చేసింది. పరారీలో ఉన్న మరో ఇద్దరినీ ఈ జాబితాలో చేర్చింది.

గతేదాడి మే 4న దిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో యువ రెజ్లర్‌ సాగర్‌ ధన్‌కర్‌ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సుశీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. స్టేడియంలో ఘర్షణకు సుశీల్ కుట్ర పన్నాడని, ఆపై హత్య చేశాడని దిల్లీ పోలీసులు తమ ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిలో కొందరిని పోలీసులు అరెస్టు చేయగా... ఈ విషయాలు బయటికొచ్చాయి.

ఇంటి అద్దె విషయంలో సుశీల్‌కు, సాగర్‌కు గతంలో గొడవలు జరిగాయని, సాగర్‌పై ఆదిపత్యం చలాయించేందుకే సుశీల్‌ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తేల్చారు. హత్య తర్వాత మూడు వారాలపాటు తప్పించుకుని తిరిగిన సుశీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం తీహాడ్‌ జైల్లో ఉన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.