ETV Bharat / sports

సాయ్ కోర్సుల్లో చేరేందుకు నిబంధనల సడలింపు - సాయ్​

భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్​) నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక శిక్షణా కోర్సుల్లో మరింత మంది క్రీడాకారులు పాల్గొనే విధంగా నిబంధనలు సడలించారు. అంతర్జాతీయ క్రీడా వేదికల్లో పాల్గొన్న వారు సహా జాతీయ క్రీడల్లో ఏ పతకం సాధించిన వారైనా అర్హులని సంస్థ తెలిపింది.

Olympians, world c'ship participants to get direct entry to NIS Patiala's coaching course
ఒలింపిక్​ అథ్లెట్లకు కోర్సుల్లో నేరుగా ఎంట్రీ: సాయ్​
author img

By

Published : Jul 10, 2020, 9:27 PM IST

పటియాలలోని నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ స్పోర్ట్స్​ (ఎన్ఐఎస్​)లో 46 మంది ప్రముఖ అథ్లెట్లు ప్రతిష్టాత్మక డిప్లొమా కోర్సులకు ప్రత్యక్ష ప్రవేశం పొందారని సాయ్​ ప్రకటించింది. ప్రఖ్యాత అథ్లెట్లతో పాటు మరికొంత మంది శిక్షణ పొందటానికి ఆన్​లైన్​ పరీక్ష నిర్వహించనున్నట్లు సాయ్​ తెలిపింది. ఈ కోర్సుల్లో చేరడానికి కావాల్సిన అర్హతలను మే నెలలో విడుదల చేసింది. అయితే ఎక్కువ మంది క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకుగానూ కొన్ని నిబంధనలను సడలించి దరఖాస్తు దారులకు ఆన్​లైన్​ పరీక్ష నిర్వహిస్తామని సాయ్​ తాజా ప్రకటనలో పేర్కొంది.

వారూ అర్హులే..

"ఎన్​ఐఎస్​లో చేరదలచిన సీనియర్​ క్రీడాకారులు కచ్చితంగా అంతర్జాతీయ వేదిక మీద పతకం సాధించి ఉండాలని గతంలో ప్రకటించాం. కానీ, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొన్నవారూ దీనికి అర్హులే. ఆసియా, కామన్​ వెల్త్​ క్రీడల్లో బంగారు పతకం సాధించిన వారే కాకుండా పతకమేదైనా పొంది ఉన్నా దీనికి అర్హులని తాజాగా నిర్ణయించాం. ఒలింపిక్స్​, ప్రపంచ ఛాంపియన్​ షిప్​లో పాల్గొన్న ప్రముఖ క్రీడాకారులు నేరుగా ఈ కోర్సులో చేరడానికి అనుమతిస్తున్నాం" అని సాయ్​ తాజా ప్రకటనలో వెల్లడించింది.

దరఖాస్తు గడువు పొడిగింపు

ఎన్​ఐఎస్​ నిర్వహించే కోర్సులకు దేశంలోని 23 క్రీడల నుంచి 46 మందిని (ఒక క్రీడాకారుడు, ఒక క్రీడాకారిణి) ఎంపిక చేశారు. వీరందరూ ఆన్​లైన్​ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదని సాయ్​ వెల్లడించింది. ఒకవేళ ఇద్దరు ప్రముఖ అథ్లెట్లు ఒకే విభాగాన్ని ఎంచుకుంటే వారిద్దరి పాయింట్లను పోల్చి వారిలో ఉత్తమ ఆటగాళ్లను ఎంచుకుంటామని తెలిపింది. ఈ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిన తేదీని జులై 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.