ETV Bharat / sports

మసాజ్​ చేయమని, బట్టలు ఉతకమని టార్చర్​ పెట్టారు: స్టార్​ స్ప్రింటర్​ ద్యుతి - Dutee Chand

Dutee Chand Ragging: దేశంలోనే అత్యంత వేగవంతమైన మహిళా రన్నర్‌గా పేరున్న ద్యుతి చంద్​.. తాను ఎదుర్కొన్న వేధింపుల సమస్యను బయటపెట్టింది. తనను బలవంతంగా మసాజ్​ చేయమని, బట్టలు ఉతకమని టార్చర్​ పెట్టారని తెలిపింది.

Olympian Dutee Chand
ద్యుతి చంద్​
author img

By

Published : Jul 4, 2022, 12:33 PM IST

Dutee Chand Ragging: ప్రముఖ స్ప్రింటర్​ ద్యుతి చంద్​.. తన కెరీర్​లో ఎదుర్కొన్న ర్యాగింగ్​ సమస్యను బయటపెట్టింది. భువనేశ్వర్​లోని స్పోర్ట్స్​ హాస్టల్​లో ఉన్నప్పుడు సీనియర్లు తనను తీవ్రంగా వేధించేవారని గుర్తుచేసుకుంది. ఇటీవలే భువనేశ్వర్​లోని బీజేబీ కాలేజిలో 19ఏళ్ల విద్యార్థి.. ర్యాగింగ్ భూతం​ కారణంగా సూసైడ్ చేసుకుంది. ముగ్గురు సీనియర్లు వేధించడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె సూసైడ్ నోట్​ రాసింది. ఈ ఘటన అక్కడ చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే దీనిపై స్పందించిన ద్యుతి.. తాను ఎదుర్కొన్న వేధింపుల సమస్యను ఓ పోస్ట్​ ద్వారా తెలిపింది.

"మేము కూడా ఈ స్పోర్ట్స్​ హాస్టల్​లో ర్యాగింగ్​ సమస్యను ఎదుర్కొన్నాం. సీనియర్లు బలవంతంగా మసాజ్ చేయమని, తమ బట్టలు ఉతకమని బలవంతం చేసేవారు. దానిని వ్యతిరేకించినప్పుడు నన్ను టార్చర్​ పెట్టేవాళ్లు. ఆ బాధను ఎవరి ముందు చెప్పుకోలేను. మూడేళ్లు నొప్పిని భరించా" అని ద్యుతి ఆవేదన వ్యక్తం చేసింది. దీనివల్ల తాను క్రీడలపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోయేదని, మానసికంగా ఇబ్బంది పడినట్లు తెలిపింది. కాగా, ఆమె 2006-08 వరకు ఈ స్పోర్ట్స్​ హాస్టల్​లో ఉంది. ప్రస్తుతం ద్యుతి.. ఈ నెల చివర్లో ప్రారంభంకాబోయే కామన్​వెల్త్​ క్రీడల కోసం సన్నద్ధమవుతోంది. ఈ పోటీల్లో సత్తాచాటాలని శ్రమిస్తోంది.

ఇదీ చూడండి: IND VS ENG: బెయిర్​స్టోకు కోహ్లీ ఫ్లయింగ్​ కిస్​.. సెహ్వాగ్​ ఫన్నీ కామెంట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.