మరో ఒలింపియన్ శత వసంతంలోకి అడుగుపెట్టారు. హంగేరీ జిమ్నాస్ట్ అగ్నెస్ కెలెటీ శనివారం తన 100వ పుట్టినరోజు ఎంతో ఆనందంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు, సాధించిన ఘనతలన్నింటినీ ఓ చోటకు చేర్చి 'ది క్వీన్ ఆఫ్ జిమ్నాస్టిక్స్: 100 ఇయర్స్ ఆఫ్ అగ్నెస్ కెలెటీ' పేరుతో పుస్తకాన్ని విడుదల చేశారు. నూరేళ్ల జీవితాన్ని ఎంతో ఆస్వాదించినట్లు తెలిపారు.
1921లో పుట్టిన కెలెటీ.. కెరీర్లో ఐదు స్వర్ణలతో కలిపి మొత్తంగా 10 ఒలింపిక్ పతకాలు సాధించారు. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో ఆరు మెడల్స్ సాధించి అత్యంత విజయవంతమైన అథ్లెట్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇదీ చూడండి : అశ్విన్ బౌలింగ్‌లో 10సార్లు ఔటైన బ్యాట్స్‌మన్!