35 ఏళ్లు దాటితేనే చాలామంది క్రీడాకారులకు రిటైర్మెంట్పై చర్చలు నడుస్తుంటాయి. అలాంటిది 45 ఏళ్లు వచ్చినా ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది ఉజ్బెకిస్థాన్ జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి ఒక్సానా చుసోవితినా. తాజాగా 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించి.. ఈ ఘనత సాధించిన ఎక్కువ వయసున్న జిమ్నాస్ట్‌గా రికార్డు సృష్టించింది.
1992లో తొలిసారి బార్సిలోనా వేదికగా జరిగిన విశ్వక్రీడల్లో పోటీపడింది ఒక్సానా. ఆ పోటీల్లో స్వర్ణం కైవసం చేసుకున్నఈ స్టార్ ప్లేయర్... అప్పటి నుంచి ప్రతి విశ్వక్రీడలకు అర్హత సాధించింది. తాజాగా 8వ సారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతోంది. ఒక్సానా ఒలింపిక్స్ ప్రయాణానికి సంబంధించిన వీడియోను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ట్విట్టర్లో షేర్ చేసింది.
-
She will be 45 years old in @Tokyo2020. Respect 👏 pic.twitter.com/yBLGWFZ2sa
— Olympics (@Olympics) October 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">She will be 45 years old in @Tokyo2020. Respect 👏 pic.twitter.com/yBLGWFZ2sa
— Olympics (@Olympics) October 15, 2019She will be 45 years old in @Tokyo2020. Respect 👏 pic.twitter.com/yBLGWFZ2sa
— Olympics (@Olympics) October 15, 2019
2020 టోక్యో విశ్వక్రీడలు జరిగే సమయానికి ఆమెకు 45 ఏళ్లు నిండుతాయి. 2016 రియో ఒలింపిక్స్ జరిగినపుడు ఆమె వయసు 41 సంవత్సరాలు. విశ్వక్రీడల్లో ఒకే ఒక్క స్వర్ణం దక్కించుకున్న ఒక్సానా... మరో పతకం కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. 40 ఏళ్లు పైబడినా అదే ఉత్సాహంతో దూసుకెళ్తోంది.
ఇదీ చదవండి: గంగూలీ వల్లే భారత్‌పై పాక్ ఓడింది: అక్తర్