ETV Bharat / sports

కరోనా వ్యాక్సిన్​ వేసుకోని జకోవిచ్ యూఎస్​ ఓపెన్​లో​ ఆడనున్నాడా - నొవాక్‌ జకోవిచ్‌

కరోనా వ్యాక్సిన్‌ వేసుకోని కారణంగా ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు దూరమైన టెన్నిస్‌ స్టార్‌ జకోవిచ్‌ యూఎస్​ ఓపెన్‌లోనూ పోటీపడడం అనుమానంగా మారింది. అమెరికా నిబంధనల ప్రకారం వ్యాక్సిన్‌ వేసుకోని విదేశీయులకు ఆ దేశంలో ప్రవేశం లేదు. దీంతో అతను పాల్గొనడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Novak Djokovic
Novak Djokovic
author img

By

Published : Aug 14, 2022, 9:42 AM IST

Novak Djokovic US Open: టెన్నిస్‌ దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ ఈ ఏడాదిలో చివరి గ్రాండ్‌స్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌లో పోటీపడడం అనుమానంగా మారింది. అతను కరోనా టీకా వేసుకోకపోవడమే అందుకు కారణం. తాజాగా యుఎస్‌ ఓపెన్‌కు సన్నాహకంగా నిర్వహించే సిన్సినాటి మాస్టర్స్‌ టోర్నీకి అతను దూరమయ్యాడు. ప్రస్తుతానికి టీకా వేసుకోని విదేశీయులకు యుఎస్‌ఏలోకి అనుమతి లేదు. దీంతో సిన్సినాటి టోర్నీ కోసం అతను అమెరికాలో అడుగుపెట్టే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 29న ఆరంభమయ్యే యుఎస్‌ ఓపెన్‌లోనూ అతను పాల్గొనడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

టెన్నిస్‌ టోర్నీలకు దూరమైనా సరే కానీ టీకా మాత్రం వేసుకోనని 35 ఏళ్ల జకోవిచ్‌ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అతనాడకపోవడానికి కూడా అదే కారణం. అలాగే యూఎస్‌లో రెండు టోర్నీలకూ దూరమయ్యాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ విజయాల్లో 21 టైటిళ్లతో నాదల్‌ (22) తర్వాత రెండో స్థానంలో ఉన్న జకో.. యుఎస్‌ ఓపెన్‌లో ఆడాలంటే అక్కడి ప్రభుత్వం టీకా నిబంధనలు సడలించాల్సి ఉంటుంది. మరి అందుకు ప్రభుత్వం సమ్మతిస్తుందో లేదో చూడాలి. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉంటామని ఇప్పటికే యుఎస్‌ టెన్నిస్‌ సంఘం కూడా తేల్చిచెప్పింది. యుఎస్‌ ఓపెన్‌లో బరిలో దిగుతాననే ఆశ ఇంకా తనకు ఉందని అతనంటున్నాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అది అసాధ్యంగా కనిపిస్తోంది. అతను ఈ టోర్నీలో మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచాడు. గతేడాది ఫైనల్లో మెద్వెదెవ్‌ చేతిలో ఓడాడు.

ఇవీ చదవండి: భవిష్యత్​లో టెస్టు క్రికెట్‌ ఆడేవాళ్లు అసలు ఉంటారా

వరల్డ్‌ ఛాంపియన్‌షిప్​కు పీవీ సింధు దూరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.