ETV Bharat / sports

'టీకా ఇవ్వమని ఏ అథ్లెటూ కోరలేదు'

టోక్యో ఒలింపిక్స్​కు మరో 3 నెలల సమయం మాత్రమే ఉంది. వ్యాక్సినేషన్​కు సంబంధించి ఈ మెగా ఈవెంట్​లో పాల్గొనే అథ్లెట్ల నుంచి ఇప్పటివరకు అభ్యర్థనలేమీ రాలేదని ఒలింపిక్స్​ నిర్వాహక కమిటీ తెలిపింది. ఈ సారి ఖాళీ స్టేడియాల్లోనే ఒలింపిక్స్​ను నిర్వహించాల్సి వస్తుందని నిర్వాహక కమిటీ అభిప్రాయపడింది.

tokyo olympics 2020, olympic organising committe
టోక్యో ఒలింపిక్స్​, ఒలింపిక్ నిర్వాహక కమిటీ
author img

By

Published : Apr 21, 2021, 2:11 PM IST

వ్యాక్సినేషన్​కు సంబంధించి ఒలింపిక్​లో పాల్గొనే అథ్లెట్ల నుంచి ఇప్పటి వరకు అభ్యర్థనలేమీ రాలేదని టోక్యో ఒలింపిక్స్​ నిర్వాహక కమిటీ తెలిపింది. ఈ మెగా ఈవెంట్​కు మరో మూణ్నెల్ల గడువు మాత్రమే ఉంది.

జపాన్​లో టీకా తీసుకుంటున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని కమిటీ వెల్లడించింది. ఇప్పటివరకు 1 శాతం కన్నా తక్కువ ప్రజలు మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారని.. వ్యాక్సినేషన్​కు మొగ్గు చూపకపోవడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొంది.

"కొవిడ్​ టీకాలపై అథ్లెట్లకు పలు సందేహాలు ఉన్నాయి. అయితే వారు వ్యాక్సిన్ తీసుకుంటారా లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదని" కమిటీ ఛైర్​పర్సన్ నావోకో తకాహషి తెలిపారు.

ఇదీ చదవండి: ధోనీ తల్లిదండ్రులకు కరోనా

ఈ సారి ఒలింపిక్స్​ను ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించాల్సి వస్తుందేమోనని.. వ్యాక్సిన్​ రోల్​ అవుట్​ బాధ్యత మంత్రి టారో కోనో పేర్కొన్నారు. టీకా వేసుకునే వారి సంఖ్య స్వల్పంగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒలింపిక్స్​కు ఇప్పటికే విదేశీ అభిమానులను నిషేధించారు. అసలు స్టేడియాల్లో సగం మంది ప్రేక్షకులైనా ఉంటారా అనేది ఊహించటం కష్టంగా మారింది. జపాన్​లోని మెజారిటీ ప్రజలు ఈ మెగా ఈవెంట్​ను వాయిదా వేయాలని కోరుతున్నారు. అయితే వ్యాక్సినేషన్​కు సంబంధించి ప్రభుత్వం కూడా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని కమిటీ అభిప్రాయపడింది.

ఒలింపిక్స్​లో పాల్గొనడానికి టీకాలు వేయించుకోవాల్సిన అవసరం లేదని ఓ వైపు అంతర్జాతీయ ఒలింపిక్స్​ కమిటీ చెబుతుంది. మరోవైపు టీకాలు వేసుకోమని ఐఓసీ అధ్యక్షుడు థామస్​ బాచ్​ బహిరంగంగా అథ్లెట్లను ప్రోత్సహిస్తున్నారు.

ఇదీ చదవండి: కెప్టెన్ కోహ్లీ పేరుతో సర్క్యులర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.