ETV Bharat / sports

సెరేనా విలియమ్స్​ సరసన నీతా అంబానీ - mumbai indians news

భారత కుబేరుడు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీకి అత్యంత ప్రభావితమైన టాప్​ 10 స్పోర్ట్స్​ ఉమెన్ జాబితాలో స్థానం దక్కింది. 2020కి గాను ఐస్పోర్ట్​కనెక్ట్​ విడుదల చేసిన ఈ జాబితాలో టెన్నిస్ దిగ్గజం సెరేనా విలియమ్స్ సరసన నిలిచారు నీతా.

nita-ambani
సెరేనా విలియమ్స్​ సరసన నీతా అంబానీ
author img

By

Published : Mar 12, 2020, 4:52 PM IST

ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్ జట్టు యజమాని నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. 2020కి గాను టాప్​ 10 స్పోర్ట్స్​ ఉమెన్​ జాబితాలో చోటు లభించింది. క్రీడా వాణిజ్య సంస్థ ఐస్పోర్ట్​కనెక్ట్​ ' ఇన్​ఫ్ల్యూయెన్సియల్​ ఉమన్​ ఇన్​ స్పోర్ట్స్​ లిస్ట్ ఫర్​ 2020 ' పేరుతో ఈ జాబితాను విడుదల చేసింది. మొదట 25మందిని ఎంపిక చేసి తుది జాబితాలో 10మందికి చోటు కల్పించారు.

భారత్​లో అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ సతీమణి నీతాతో పాటు ఈ జాబితాలో టెన్నిస్ స్టార్లు సెరేనా విలియమ్స్, నయోమి ఒసాకా ఉన్నారు. ప్రఖ్యాత జిమ్నాస్ట్​ సిమోన్​ బైల్స్​, ఫుట్​బాల్ క్రీడాకారిణి మేగన్ రేపినోకు స్థానం లభించింది.

ఫార్ములా వన్ మార్కెటింగ్ డైరెక్టర్​ ఎల్లీ నోర్మన్​, డబ్ల్యూఎన్​బీఏ కమిషనర్​ క్యాథీ ఎంగెల్బర్ట్​, ఫిఫా ప్రధాన కార్యదర్శి ఫట్మా సమౌరా, స్పెషల్​ ఒలింపిక్స్ సీఈఓ మేరీ డేవిస్​, ఇంగ్లాంగ్ క్రికెట్​ బోర్డు(మహిళలు) మేనేజింగ్ డైరెక్టర్​ క్లేర్ కాన్నర్​లు టాప్ 10 జాబితాలో ఉన్నారు.

ఐపీఎల్​లో నాలుగు సార్లు టైటిల్ గెలిచి, అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన ముంబయి ఇండియన్స్​ను ముందుండి నడిపిస్తున్నారు నీతా. దేశంలోని ఇతర క్రీడా ప్రాజెక్టులలోనూ పాల్గొంటున్నారు. 2014 నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్​ బోర్డులో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

మొదటగా రూపొందించిన 25మంది జాబితాలో భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా, మహిళా టీమిండియా సారథి మిథాలీ రాజ్ ఉన్నట్లు ఐస్పోర్ట్​కనెక్ట్​​ తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.