భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ - నిఖత్ జరీన్ మధ్య పోరు జరగనుంది. ఒలింపిక్స్ అర్హత పోటీల కోసం నిర్వహించిన ట్రయల్స్‌లో హైదరాబాదీ బాక్సర్ జరీన్.. జ్యోతి గులియాను ఓడించింది. 51కేజీల విభాగంలో తొలి రౌండ్లోనే ప్రత్యర్థిపై పైచేయి సాధించింది.
అంతకుముందు రీతూ గ్రేవాల్‌పై గెలిచింది మేరీ కోమ్. శనివారం నిఖత్ - మేరీ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన వారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనా వేదికగా జరగనున్న ఒలింపిక్స్ అర్హత పోటీల్లో భారత్ తరఫున తలపడతారు.
ఒలింపిక్స్ అర్హత పోటీలకు ట్రయల్స్ నిర్వహించాలని హైదరాబాదీ బాక్సర్ నిఖత్ జరీన్ కొన్ని రోజుల క్రితం డిమాండ్ చేసింది. ఈ మేరకు రెండు రోజులు పాటు ఈ పోటీలను నిర్వహించింది భారత బాక్సింగ్ ఫెడరేషన్. 51, 57, 60, 69, 75 కేజీల విభాగాల్లో ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి.
ఇదీ చదవండి: వైరల్: జకోకు ఎలా ఎగరాలో నేర్పిస్తున్న రొనాల్డో