పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో.. ఇటీవలే జరిగిన ఓ మ్యాచ్‌లో 8 అడుగులకు పైగా ఎత్తు ఎగిరి అద్భుతమైన హెడ్గోల్ కొట్టాడు. తాజాగా ఈ ఫుట్‌బాలర్.. సెర్బియా టెన్నిస్ స్టార్ జకోవిచ్‌కు ఎగరడమెలాగో నేర్పిస్తున్నాడు.
శుక్రవారం ఒకే జిమ్‌లో కలిసిన వీరిద్దరూ, కలిసి కసరత్తులు చేశారు. ఈ సందర్భంగా జకోకు ఎగరడమేలాగో శిక్షణనిచ్చాడు రొనాల్డో. ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడీ ఫుట్‌బాలర్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
- View this post on Instagram
Teaching @djokernole how to jump!!😅🤪💪🏽 Was a pleasure to see you and train with you my friend!!
">
"నొవాక్ జకోవిచ్‌కు జంప్ ఎలా చెయ్యాలో నేర్పిస్తున్నా. నీతో కలిసి ట్రైనింగ్.. భాగ్యంగా భావిస్తున్నా మై ఫ్రెండ్" - క్రిస్టియానో రొనాల్డో
ఇటీవలే సంప్రోడియా - జ్యూవెంటస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తలతో అద్భుతమైన గోల్ కొట్టాడు రొనాల్డో. దాదాపు 8.39 అడుగుల ఎత్తుకు ఎగిరి గోల్ చేశాడు.
ఇదీ చదవండి: భవిష్యత్తులో పంత్ మరింత పుంజుకుంటాడు: ఎమ్మెస్కే