ప్రపంచ ఛాంపియన్షిప్ విజేత, స్టార్ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధమైంది. సెలక్షన్ ట్రయల్స్‌లో హరియాణాకు చెందిన మీనాక్షిపై 7-0 తేడాతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది నిఖత్. దీంతో ఆమెకు కామన్వెల్త్లో 50కేజీల కేటగిరీలో పోటీ చేసేందుకు బెర్త్ కన్ఫామ్ అయింది. మరోవైపు ఒలిపింక్స్ కాంస్య పతక విజేత లవ్లీనాకు కూడా కామన్వెల్త్లో పోటీ చేసేందుకు లైన్ క్లియరైంది. ఆమె 70 కిలోల కేటగిరీలో బరిలోకి దిగనుంది. వీరితో పాటు నీతు గంఘస్ (48 కేజీ), జాస్మిన్ లంబోరియా (60 కేజీ) కూడా భారత్ తరఫున మహిళా బాక్సర్ల బృందంలో ఉన్నారు.
"ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల తర్వాత నేను ట్రెయినింగ్‌కు దూరంగా ఉన్నాను. దీంతో మళ్లీ బౌట్లో నిలదొక్కుకోవడం కాస్త ఇబ్బంది అనిపించింది. అయినా ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిపై విజయం సాధించగలిగాను. ఈ ప్రదర్శన నా సామర్థ్యంలో 50 శాతం కూడా ఉండదు."
-నిఖత్ జరీన్, బాక్సర్
మేరీకామ్ ఔట్..: ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన స్టార్ బాక్సర్ మేరీకామ్ ఈ కామన్వెల్త్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి మరోసారి సత్తాచాటుదామనుకున్నారు. కానీ ఆమెకు గాయం రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం జరిగిన బాక్సింగ్ ట్రయల్స్‌లో ఆమె మోకాలికి గాయమైంది. దీంతో మేరీకామ్ ఈ కామన్వెల్త్ క్రీడలకు దూరమయ్యారు. బర్మింగ్హమ్ వేదికగా ఈనెల 18 నుంచి 22 వరకు కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి.
-
Indian Women's 🥊 Squad for #CWG2022 🔥🔥🔥@LovlinaBorgohai @nikhat_zareen @NituGhanghas333 #Jasmine #IndianSports #Boxing https://t.co/7NY5N2jJ89
— SAI Media (@Media_SAI) June 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Indian Women's 🥊 Squad for #CWG2022 🔥🔥🔥@LovlinaBorgohai @nikhat_zareen @NituGhanghas333 #Jasmine #IndianSports #Boxing https://t.co/7NY5N2jJ89
— SAI Media (@Media_SAI) June 11, 2022Indian Women's 🥊 Squad for #CWG2022 🔥🔥🔥@LovlinaBorgohai @nikhat_zareen @NituGhanghas333 #Jasmine #IndianSports #Boxing https://t.co/7NY5N2jJ89
— SAI Media (@Media_SAI) June 11, 2022
ఇదీ చూడండి : 'చాలా కష్టపడ్డా.. పెద్ద యుద్ధమే చేశా.. ఇప్పుడు నేను హ్యాపీ'