ETV Bharat / sports

ఓ మ్యాచ్​ గెలిస్తే మేరీతో నిఖత్ ఢీ - Nikhat Olympic Trails

హైదరాబాద్​ బాక్సర్ నిఖత్ జరీన్.. ఒలింపిక్స్​ అర్హత టోర్నీ కోసం బాక్సింగ్ ట్రయల్స్​లో ఓ మ్యాచ్​ గెలిస్తే స్టార్ బాక్సర్ మేరీకోమ్​తో తలపడనుంది. ఈ నెల 27, 28వ తేదీల్లో దిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిఖత్ 51 కేజీల విభాగంలో పోటీపడనుంది.

Nikhat Going to match in Olympic Trails with Mary Kom
నిఖత్ జరీన్
author img

By

Published : Dec 22, 2019, 7:32 AM IST

తెలంగాణ స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌.. టోక్యో ఒలింపిక్స్‌ అర్హత టోర్నీ కోసం బాక్సింగ్‌ ట్రయల్స్‌లో పోటీ పడే అవకాశం దక్కించుకుంది. ఈ నెల 27, 28 తేదీల్లో దిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే ట్రయల్స్‌లో 51 కేజీల విభాగంలో పోటీ పడనుంది.

ఈ విభాగంలో దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌, జ్యోతి గులియా, రితు గ్రెవాల్‌ ఇప్పటికే ట్రయల్స్‌కు అర్హత సాధించారు. మిగిలిన ఒక్క బెర్తును నిఖత్‌కు కేటాయిస్తున్నట్లు భారత బాక్సింగ్‌ సమాఖ్య సెలక్షన్‌ కమిటీ శనివారం ప్రకటించింది. ఈ నలుగురి మధ్య పోటీలో విజేతగా నిలిచే బాక్సర్‌ టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్తుంది.

మొదట మేరీకోమ్‌-రితు, నిఖత్‌-జ్యోతిల మధ్య బౌట్స్‌ జరుగుతాయి. విజేతలు ఫైనల్లో తలపడతారు. మేరీకోమ్‌ ఫైనల్‌ చేరడం లాంఛనమే అని భావిస్తున్నారు. కొన్నాళ్లుగా ఆమెను సవాల్‌ చేస్తూ వస్తున్న నిఖత్‌.. తుది పోరుకు అర్హత సాధించి, ఈ దిగ్గజ బాక్సర్‌ను జయించి టోక్యో అర్హత టోర్నీకి వెళ్తుందేమో చూడాలి.

బీబీఎల్‌ విజేత గుజరాత్‌ జెయింట్స్‌:

బిగ్​బౌట్‌ ఇండియన్‌ బాక్సింగ్‌ లీగ్‌ అరంగేట్ర సీజన్లో గుజరాత్‌ జెయింట్స్‌ విజేతగా నిలిచింది. శనివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో గుజరాత్‌ 4-3తో పంజాబ్‌ పాంథర్స్‌ను ఓడించింది.

ఇదీ చదవండి: కోట్లు పెట్టి కొంటే కోటి ఆశలు కల్పిస్తున్నారు..!

SNTV Digital Daily Planning Update, 0100 GMT
Sunday 22nd December 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Reaction from Klopp after Liverpool win Club World Cup. Already moved.
SOCCER: Reaction from Flamengo fans in Rio after Club World Cup final. Already moved.
BASKETBALL (NBA): Injured Nets star Kevin Durant spreads holiday cheer for NYC children of homeless families. Already moved.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.