ETV Bharat / sports

రాకెట్​ విసిరిన ప్లేయర్​.. త్రుటిలో తప్పించుకున్న బాల్​బాయ్​ - టెన్నిస్​ రాకెట్​ బాల్​బాయ్​

Nicolas Rocket Ballboy: ఓ టెన్నిస్‌ క్రీడాకారుడు ఓటమి బాధలో రాకెట్‌ను నేలకేసి కొట్టాడు. అయితే అది నేరుగా అక్కడే ఉన్న ఓ బాల్‌బాయ్‌ వైపు దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన అతడు.. త్రుటిలో దాని బారి నుంచి తప్పించుకున్నాడు. అసలు ఏమైందంటే?

ball boy
nicolas
author img

By

Published : Mar 19, 2022, 8:13 PM IST

Nicolas Rocket Ballboy: ఇండియా వెల్స్​ ఓపెన్​ టోర్నీలో ఓ షాకింగ్​ ఘటన జరిగింది. క్వార్టర్​ ఫైనల్స్​లో ఓడిపోయిన ఆస్టేలియా ఆటగాడు నికోలస్​ రాకెట్​ను నేలకేసి కొట్టాడు. దీంతో ఆ రాకెట్​ బాల్​బాయ్​ వైపు దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన అతడు తప్పించుకున్నాడు.

అసలు ఏం జరిగిందంటే?

India Wells Open : ఆస్ట్రేలియా ఆటగాడు నికోలస్‌ కిర్గియోస్‌.. క్వార్టర్‌ ఫైనల్స్‌లో స్పెయిన్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌తో తలపడ్డాడు. 7-6 (7/0), 4-7, 6-4 తేడాతో ఓటమిపాలయ్యాడు. మ్యాచ్‌ అనంతరం నాదల్‌తో కరచాలనం చేసిన అతడు‌.. తర్వాత అసహనంతో తన రాకెట్‌ను నేలకేసి విసిరికొట్టాడు. అది కోర్టులోనే ఓ మూలన నిల్చున్న బాల్‌బాయ్‌ వైపు బలంగా దూసుకెళ్లింది. వెంటనే బాల్‌బాయ్‌ పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది.

ఈ ఘటన జరిగిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడిపై నెటిజన్లు మండిపడుతున్నారు. వాటిపై స్పందించిన నిక్‌ క్షమాపణలు చెప్పాడు. ఆ బాల్‌బాయ్‌కి ఓ కొత్త రాకెట్‌ బహుమతిగా ఇస్తానని పేర్కొన్నాడు. దానికి ఆ బాల్‌బాయ్‌ సైతం సానుకూలంగా స్పందించాడు.

ఇదీ చదవండి: మరో ఐపీఎల్​ వేటలో 'హిట్​మ్యాన్​', 'మిస్టర్​ కూల్'​.. ప్రాక్టీస్​ షురూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.