ETV Bharat / sports

స్వర్ణం గెల్చినందుకు రూ. 6 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగం

టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించిన జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రాకు.. రూ. 6కోట్లు ప్రకటించింది హరియాణా ప్రభుత్వం. క్లాస్​ వన్ ఉద్యోగంతోపాటు, 50 శాతం రాయితీతో ఓ ఫ్లాట్ అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్​లాల్ ఖట్టర్ తెలిపారు.

Neeraj Chopra
నీరజ్ చోప్రా
author img

By

Published : Aug 7, 2021, 6:52 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో జావెలిన్​ త్రో లో స్వర్ణం సాధించిన యువ సంచలనం నీరజ్​ చోప్రాకు హరియాణా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. చోప్రాకు 6 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్​ ఖట్టర్. అంతేకాక క్లాస్ వన్ కేటగిరీలో ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. మిగతా ఆటగాళ్లలాగానే.. 50శాతం రాయితీతో ఓ ఫ్లాట్ అందిస్తామన్నారు. చోప్రా కోరితే.. పంచకుల ప్రాంతంలో అథ్లెట్స్ కోసం ఓ స్టేడియంను కూడా నిర్మిస్తామన్నారు.

ఒలింపిక్స్​ అథ్లెటిక్స్‌లో తొలి పతకం కోసం 120 ఏళ్లుగా నిరీక్షించిన భారత్​ కల ఫలించింది. జావెలిన్​ త్రో ఫైనల్లో గెలిచిన యువ సంచలనం నీరజ్​ చోప్రా మువ్వన్నెల పతాకానికి పసిడి కాంతులద్దాడు.

23 ఏళ్ల ఈ కుర్రాడు ఎన్నో ఆశలు.. అంచనాలతో టోక్యోకు వెళ్లి స్వర్ణం గెలిచి భారత్​ గర్వించేలా చేశాడు.

ఇవీ చదవండి:

Olympics: చరిత్ర సృష్టించిన నీరజ్​ చోప్రా- భారత్​కు స్వర్ణం

Olympics: బజరంగ్​ పునియాకు కాంస్యం- భారత్​కు ఆరో పతకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.