ETV Bharat / sports

Neeraj Chopra Family Background : 'కలిసుంటే కలదు సుఖం.. ఇదే నీరజ్ విజయాలకు కారణం' - నీరజ్ చోప్రా పతకాలు

Neeraj Chopra Family Background : ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్​షిప్​లో స్వర్ణ పతకం సాధించి నీరజ్​ చోప్రా చరిత్ర సృష్టించాడు. అతడి విజయం వెనుక ఉమ్మడి కుటుంబ ఉందని నీరజ్​ చోప్రా తండ్రి సతీష్​ చోప్రా తెలిపారు. ఇంకా ఆయన ఎమన్నారంటే?

Neeraj Chopra Father
Neeraj Chopra Father
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 5:53 PM IST

Updated : Aug 29, 2023, 7:23 PM IST

Neeraj Chopra Family Background : నీరజ్​ చోప్రా సాధించిన విజయాలన్నింటి వెనక తమ ఉమ్మడి కుటుంబ సహకారం ఉందని ఆయన తండ్రి సతీష్​ చోప్రా తెలిపారు. ఉమ్మడి కుటుంబ సభ్యులు అండగా నిలవడం వల్లే నీరజ్ చోప్రా ఇన్ని విజయాలను సాధించాడని ఆయన అన్నారు. ఆయన నీరజ్ కుటుంబానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు.

Neeraj Chopra Family Background
నీరజ్ చోప్రా తండ్రి

"మా తండ్రి పేరు ధరమ్​ సింగ్​. మేము నలుగురు అన్నదమ్ములం.​ మేమందం ఎట్టిపరిస్థితుల్లోనూ విడిపోకూడదని మా నాన్న చిన్నప్పుడే చెప్పారు. ఆయన చెప్పిన ఆ మాటలు ఎప్పటికీ నాకు గుర్తున్నాయి. మేము అలానే చేశాము. ఉమ్మడి కుటుంబం అందించిన సహకారం వల్లే నీరజ్​ చోప్రా విజయాలను సాధిస్తున్నాడు. నాకు భీమ్​ చోప్రా, సుల్తాన్​ చోప్రా, సురేంద్ర చోప్రా అనే ముగ్గురు సోదరులు ఉన్నారు. భీమ్​ చోప్రా పిల్లల పెంపంకం, చదువు, ఆటల బాధ్యతలను చూసుకుంటారు. సుల్తాన్​ వ్యవసాయ పనులను చూస్తారు. సురేంద్ర చోప్రా ఇతర బాధ్యతలను నిర్వర్తిస్తారు. నేను ఇంటికి వచ్చే బంధువులు, కుటుంబ బాధ్యతలను చూసుకుంటాను."
--సతీష్​ చోప్రా, నీరజ్​ చోప్రా తండ్రి

ఈటీవీ భారత్​తో మాట్లాడుతున్న నీరజ్ చోప్రా తండ్రి సతీష్ చోప్రా

ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో నీరజ్​ చోప్రా బంగారు పతకం సాధించడం పట్ల తమ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారని సతీశ్ చోప్రా సోదరుడు భీమ్ చోప్రా తెలిపారు. నీరజ్ ఇంటికి వచ్చిన తర్వాత సంబరాలను చేసుకుంటామని అన్నారు. 'నీరజ్​ చోప్రాతో మాట్లాడిన తర్వాత విజయ సంబరాలను నిర్వహిస్తాం. ఇంకా నీరజ్ పలు లీగ్​ల్లో పాల్గొనాలి. వాటి కోసం శ్రమిస్తున్నాడు. నీరజ్​ చోప్రా ఇండియన్​ ఆర్మీలో సుబేదార్​గా ఉన్నాడు.' అని తెలిపారు.

Neeraj Chopra Family Background
నీరజ్ చోప్రా కుటుంబం

నీరజ్​ చోప్రా.. ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో గోల్డ్ మెడల్​ను సాధించి మరోసారి తన సత్తాను చాటుకున్నాడు. ఆగస్ట్​ 27న హంగేరీలోని బుడాపెస్ట్​లో జరిగిన ప్రపంచ ఛాంపియన్​షిప్​​ ఫైనల్​ల్లో ఈ ఘనతను సాధించాడు. 2021 టోక్యో ఒలింపిక్స్​లో గోల్డ్​మెడల్​ సాధించాడు నీరజ్​.
PM Modi Congratulates Neeraj Chopra : ఇటీవలే ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్​ చోప్రాను.. ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అంకితభావం, కచ్చితత్వమే నీరజ్​ చోప్రాను ప్రపంచ ఛాంపియన్​గా నిలిపాయని ఆయన అన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సైతం నీరజ్ చోప్రాను అభినందించారు. ప్రపంచ ఛాంపియన్​గా నిలిచిన నీరజ్​ను చూసి భారతదేశం గర్విస్తోందని తెలిపారు. అతడి విజయాన్ని చూసి దేశంలోని లక్షలాది మంది యువత స్ఫూర్తి పొందుతారని అన్నారు. ఇలాంటి విజయాలతో నీరజ్​.. మరింత ఎదగాలని కోరుకుంటున్నట్లు ముర్ము తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Neeraj Chopra Journey And Challenges : ఎన్నో అవమానాలు.. నీరజ్‌ లైఫ్ మలుపు తిరిగిందిలా.. బల్లెం వీరుడి కథ ఇది!

Neeraj Chopra Wins Gold : బల్లెం వీరుడు నీరజ్​ స్వర్ణ చరిత్ర.. ప్రపంచ ఛాంపియన్‌షిప్​లో తొలి భారత అథ్లెట్​గా ఘనత

Last Updated : Aug 29, 2023, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.