మరిన్ని పతకాలు సాధించేంతవరకు తనపై బయోపిక్ (Neeraj Chopra Biopic) వద్దన్నాడు ఒలింపిక్ పతక విజేత, జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్డా. అప్పుడే సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పాడు. టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics 2020) ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో పసిడి (Neeraj Chopra Gold Medal) సాధించి 100 ఏళ్ల భారత్ కలను నెరవేర్చాడు నీరజ్. నాటి నుంచి అతడిపై బయోపిక్ రానుందని ఊహాగానాలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన నీరజ్.. తనకు క్రీడలే ముఖ్యమన్నాడు.
"బయోపిక్‌ల కోసం నన్ను సంప్రదించారు. అయితే నేను సాధించినదానికి ఇది ఆరంభం మాత్రమే. ఇది ఇంకా నా తొలి ఒలింపిక్స్. నేను మరిన్ని పతకాలు సాధించాలి. సినిమా ఫ్లాప్ అవ్వాలని నాకు లేదు. ఎక్కువ మెడల్స్ సాధిస్తే.. సినిమా కూడా హిట్ అవుతుంది. ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం క్రీడలపైనే."
- నీరజ్ చోప్డా, జావెలిన్ త్రో ఆటగాడు
మార్పు మొదలైంది..
భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ శ్రీజేశ్ (PR Sreejesh) బయోపిక్ రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై చర్చలు జరుగుతున్నాయని శ్రీజేశ్ తెలిపాడు. టోక్యో ఒలింపిక్స్‌లో హాకీ ఇండియా కాంస్యం సాధించడంలో శ్రీజేశ్ కీలక పాత్ర పోషించాడు. ఒలింపిక్స్‌లో భారత్ ప్రదర్శనతో ప్రజల ఆలోచనా విధానం మారిందని శ్రీజేశ్ అన్నాడు. నీరజ్ బంగారు పతకం సాధించాక.. క్రీడలు, క్రీడాకారులపై విశ్వాసం పెరిగిందని చెప్పాడు.
ఇవీ చూడండి:
National Sports Award: నీరజ్, మిథాలీ, ఛెత్రికి 'ఖేల్‌రత్న'
నీరజ్ చోప్రాకు సీఎస్‌కే స్పెషల్ జెర్సీ, రూ.కోటి నజరానా
గోల్డెన్ బాయ్‌కు 'మహీంద్ర' స్పెషల్ కారు.. సీఎస్కే రూ.కోటి నజరానా