ETV Bharat / sports

టైసన్​ x జోన్స్​: ఛారిటీ బాక్సింగ్​ మ్యాచ్​ డ్రా

author img

By

Published : Nov 29, 2020, 5:00 PM IST

ఛారిటీ బాక్సింగ్​ మ్యాచ్​లో దిగ్గజ​ మైక్​ టైసన్​, రాయ్​ జోన్స్​ హోరాహోరీగా తలపడ్డారు. అయినప్పటికీ ఈ పోరు డ్రాగా ముసిగింది. దాదాపు 15ఏళ్ల తర్వాత మైక్​ టైసన్ రింగ్​లోకి అడుగుపెట్టడం విశేషం.

Mike Tyson, Roy Jones
టైసన్​xజోన్స్​

15ఏళ్ల తర్వాత రింగ్​లోకి రీఎంట్రీ ఇచ్చిన దిగ్గజ బాక్సర్ మైక్​ టైసన్,​ మరో దిగ్గజం రాయ్​ జోన్స్​ జూనియర్​ మధ్య శనివారం జరిగిన ఎగ్జిబిషన్​ మ్యాచ్​ డ్రాగా ముగిసింది. లాస్​ ఏంజెల్స్​ వేదికగా ఎనిమిది రౌండ్లు పాటు సాగిన ఈ పోరులో టైసన్​, జోన్స్​.. ఇద్దరు అద్భత ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్​ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఛారిటబుల్​ ట్రస్టులకు విరాళంగా ఇవ్వనున్నారు.

Mike Tyson, Roy Jones
టైసన్​xజోన్స్​

"ఈ ఎగ్జిబిషన్​ మ్యాచ్​ ద్వారా చారిటబుల్​ ట్రస్టులకు విరాళాలను సేకరిస్తున్నాం. ఈ ప్రపంచం కోసం మేం ఏదైనా మంచి చేస్తాం. మళ్లీ ఇలాంటి ఎగ్జిబిషన్​ మ్యాచులు ఆడుతాం"

-టైసన్​, దిగ్గజ బాక్సర్

రికార్డుల్లో ఇద్దరూ ఇలా..

రాయ్​ జోన్స్​ జూనియర్(51).. 1989 నుంచి 2018 వరకు ఆడి మిడిల్​ వెయిట్, సూపర్​ మిడిల్​ వెయిట్, లైట్​ హెవీ వెయిట్​, హెవీ వెయిట్​ బాక్సింగ్​ టైటిల్స్ సొంతం చేసుకున్నాడు.

'బ్యాడెస్ట్​ మ్యాన్​ ఆన్​ ది ప్లానెట్​'గా పేరు సంపాదించాడు దిగ్గజ బాక్సర్​ టైసన్​. 20 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్​గా నిలిచాడు. కానీ, 1990లో బస్టర్​ డగ్లాస్​తో ఓటమి తర్వాత టైసన్​ కోలుకోలేకపోయాడు. ఆ తర్వాత టైసన్​పై రేప్​, డ్రగ్స్ ఆరోపణలు కూడా వచ్చాయి. 2005లో తన చివరి మ్యాచ్ ఆడాడు.

Mike Tyson, Roy Jones
టైసన్​xజోన్స్​

ఇదీ చూడండి : బౌట్ కోసం విద్యుత్​ తీగలతో టైసన్​ ప్రాక్టీస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.