ETV Bharat / sports

Nadal: మెక్సికో ఓపెన్​ విజేతగా నాదల్​ - మెక్సికన్​ ఓపెన్​ రఫేల్​ నాదల్​

Nadal Mexican open trophy: టెన్నిస్​ దిగ్గజ ఆటగాడు రఫేల్​ నాదల్​ మరో ట్రోఫిని సొంతం చేసుకున్నాడు. మెక్సికో​ ఓపెన్​ ఫైనల్​లో విజయం సాధించి కెరీర్​లో 91వ ఏటీపీ టైటిల్​ను ముద్దాడాడు.

Nadal Mexican open trophy
మెక్సికన్​ ఓపెన్​ విజేతగా నాదల్​
author img

By

Published : Feb 27, 2022, 12:21 PM IST

Nadal Mexican open trophy: స్పెయిన్​ బుల్​ రఫేల్​ నాదల్ జోరు మీదున్నాడు.​ అతడి ఖాతాలోకి మరో టైటిల్​ వచ్చి చేరింది. శనివారం జరిగిన​ మెక్సికో ఓపెన్​ ఫైనల్​లో కామెరూన్​ నారీ​ను 6-4,6-4 తేడాతో ఓడించి విజయం సాధించాడు. ఫలితంగా కెరీర్​లో 91ఏటీపీ టైటిల్​ను ముద్దాడాడు.

నాదల్​.. ఈ ఏడాది ఇప్పటివరకు మూడు ట్రోఫీలను అందుకున్నాడు. అందులో మెల్​బోర్న్​ సమ్మర్​ సెట్​, ఆస్ట్రేలియన్​ ఓపెన్​ టైటిల్స్​ ఉన్నాయి. ఇటీవలే జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో నాదల్​ సరికొత్త చరిత్రను లిఖించాడు. జకోవిచ్‌, రోజర్ ఫెదరర్‌లను వెనక్కినెట్టి టెన్నిస్‌ ప్రపంచంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లను కైవసం చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మొత్తంగా కెరీర్​లో నాదల్‌ 31 గ్రాండ్‌స్లామ్‌లలో విజయం సాధించాడు.

కాగా, మెక్సికో​ ఓపెన్​ డబుల్స్​ విభాగంలో ఫెలిసియానో లోపెజ్-సిట్సిపాస్​ జోడీ మార్కెలొ అరివాలొ-జీన్​ జులియెన్​ రోజర్​ ద్వయాన్ని 7-5,6-4 తేడాతో ఓడించి ట్రోఫీని అందుకుంది.

ఇదీ చూడండి: Australian Open 2022: రఫేల్​దే టైటిల్.. పోరాడి ఓడిన మెద్వెదెవ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.