ETV Bharat / sports

యూరోపియన్​ టూర్​కు​ మేరీకోమ్​ దూరం

డెంగీ జ్వరంతో బాధపడుతున్న స్టార్ బాక్సర్​ మేరీకోమ్​ ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక యూరోపియన్​ టూర్​ నుంచి తప్పుకుంది. ఇప్పడిప్పుడే కాస్త కోలుకుంటున్నట్లు తెలిపింది.

Mary
మేరీకోమ్​
author img

By

Published : Oct 7, 2020, 8:39 PM IST

ఈ నెల​ 15 నుంచి ప్రారంభంకానున్న ప్రతిష్ఠాత్మక యూరోపియన్​ టూర్​కు భారత స్టార్​ బాక్సర్​ మేరీకోమ్ దూరంకానుంది. అనారోగ్యం కారణం వల్ల టోర్నీకి అందుబాటులో ఉండట్లేదని స్పష్టం చేసింది.

"గత రెండు వారాల నుంచి డెంగీ జ్వరంతో బాధపడుతున్నాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. ప్రస్తుతం కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. అందుకే ఈ టోర్నీలో ఆడలేకపోతున్నా. వచ్చే ఏడాది.. టోర్నీలో మీ అందర్నీ పలకరిస్తాను. కరోనా వ్యాక్సిన్ త్వరలోనే​ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నా."

-మేరీకోమ్​, భారత స్టార్​ బాక్సర్​.

ఈ టోర్నీ కోసం 28మందితో కూడిన బృందం త్వరలోనే ఇటలీకి బయలుదేరనుంది. ఇందులో 10మంది పురుష బాక్సర్లు, ఆరుగురు మహిళా బాక్సర్లు ఉన్నారు.

ఇదీ చూడండి కూరగాయలు అమ్ముతున్న ఆ అథ్లెట్స్​కు తలో రూ.5లక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.