దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఆసియా ఛాంపియన్షిప్ మహిళల బాక్సింగ్ ఫైనల్లో ఇద్దరు భారత మహిళా బాక్సర్లు అడుగుపెట్టారు. ప్రపంచ మాజీ ఛాంపియన్ మేరీకోమ్(51 కిలోలు)తో పాటు సాక్షి(54 కిలోలు) ఫైనల్‌కు చేరారు. అయితే అంతకుముందు రెండో సీడ్లో కజకిస్థాన్‌కు చెందిన ఆలువా బాల్కిబెకోవాపై భారత బాక్సర్ మోనిక(48 కిలోలు) పరాజయం పొంది.. కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది.
గురువారం జరిగిన టోర్నీ సెమీస్‌లో(51 కేజీలు) మంగోలియాకు చెందిన లుట్సాఖాన్ అల్తాంట్‌సెట్‌సెగ్‌ను 4-1 తేడాతో మేరీకోమ్ ఓడించగా.. టాప్ సీడ్‌కు చెందిన కజఖ్ దినా జోలామన్పై(54 కిలోలు) 3-2 తేడాతో గెలుపొందింది.
టోర్నీలో శుక్రవారం జరగనున్న పురుషుల బాక్సింగ్ సెమీఫైనల్స్‌లో అమిత్ పంగాల్ (52 కిలోలు), వరీందర్ సింగ్ (60 కిలోలు), శివ థాపా (64 కిలోలు), వికాస్ క్రిషన్ (69 కిలోలు), సంజీత్ (91 కిలోలు) పోరాడనున్నారు. వీరిలో అమిత్ పంగాల్, వికాస్ ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.
ఇదీ చూడండి: బాక్సింగ్ పోటీలు: శివ థాపకు పతకం ఖాయం