ETV Bharat / sports

అతడు ఎత్తు వేస్తే.. ప్రత్యర్థి చిత్తు అవ్వాల్సిందే - Magnus World Chess Champion

కెరీర్ ఆరంభంలోనే ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్​​ విశ్వనాథన్ ఆనంద్​ను వరుసగా ఓడించి.. తక్కువ సమయంలోనే ప్రపంచ మేటి చదరంగ క్రీడాకారుడిగా అవతరించాడు మాగ్నస్ కార్లసన్. తాజాగా మూడోసారి ర్యాపిడ్ ప్రపంచ చెస్ ఛాంపియన్​షిప్​ కైవసం చేసుకున్న కార్లసన్​పై ఓ లుక్కేద్దాం.

Magnus World Chess Champion Specal Story
మాగ్నస్ కార్లసన్
author img

By

Published : Jan 2, 2020, 7:52 AM IST

ఆరేళ్ల ముందు సంగతి. విశ్వనాథన్‌ ఆనంద్‌ అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌. ఆరోసారి టైటిల్‌ కోసం బరిలోకి దిగాడీ దిగ్గజ క్రీడాకారుడు. ఆనంద్‌ అనుభవమంత లేదు ప్రత్యర్థి వయసు! అతను ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తలపడుతోంది తొలిసారి. మ్యాచ్‌లో ఆ కుర్రాడిని ఎదుర్కోవడానికి ఆనంద్‌ తంటాలు పడుతుంటే.. డ్రా చేసుకోవడమే గగనం అన్నట్లుగా ఆడుతుంటే.. అభిమానులకు చాలా కష్టంగా అనిపించింది! చివరికి ఆనంద్‌ టైటిల్‌ కోల్పోతుంటే.. ఆనంద్‌ అభిమానుల అహం దెబ్బ తింది. తర్వాతి ఏడాది మళ్లీ ఆనంద్‌.. అదే ప్రత్యర్థికి తలవంచితే తల కొట్టేసినట్లయింది!

కానీ తర్వాత అంతర్జాతీయ చెస్‌లో ఆ కుర్రాడి ఆధిపత్యం.. అప్రతిహత విజయాలు చూశాక.. అప్పటి ఆనంద్‌ ఓటములు ఎంతమాత్రం అవమానకరం కాదని, అతను ఓడింది ప్రపంచ చెస్‌ చరిత్రలోనే ఒక మహా మేధావి చేతుల్లో అని అందరికీ అర్థమైంది! ఆ మహా మేధావి పేరు.. మాగ్నస్‌ కార్ల్‌సన్‌! ప్రస్తుతం క్లాసికల్‌, ర్యాపిడ్‌, బ్లిట్జ్‌.. ఈ మూడు రకాల చెస్‌లోనూ ఇతగాడే ప్రపంచ ఛాంపియన్‌!

మొన్న మన కోనేరు హంపి ర్యాపిడ్‌ చెస్‌లో ప్రపంచ ఛాంపియన్‌ అయింది. నిర్ణీత 12 రౌండ్లు ముగిసేసరికి మరో ఇద్దరితో కలిసి ఆమె సమాన పాయింట్లు సాధించింది. మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా, హంపి లీ టింగ్‌జీ టైటిల్‌ పోరులో తలపడ్డారు. టైబ్రేక్‌లో కూడా సమమైతే విజేతను తేల్చడానికి ఆర్మగెడాన్‌ గేమ్‌ నిర్వహించాల్సి వచ్చింది. మరి పురుషుల విభాగం పరిస్థితేంటా అని చూస్తే.. సగం రౌండ్లు అయ్యేసరికే ఛాంపియన్‌ ఎవరో తేలిపోయింది. అందరి అంచనాలకు తగ్గట్లే మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ఆధిపత్యం చలాయించాడు. అన్ని రౌండ్లూ అయ్యేసరికి ద్వితీయ స్థానంలో ఉన్న క్రీడాకారుడి కంటే అతను ఒక పాయింట్ ఆధిక్యంలో నిలిచాడు. తర్వాత బ్లిట్జ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నిర్వహిస్తే.. కాస్త పోటీ ఎదురైంది కానీ.. అతడికి ఎవ్వరూ చెక్‌ పెట్టలేకపోయారు. అర పాయింట్‌ తేడాతో అతను టైటిల్‌ ఎగరేసుకుపోయాడు. ర్యాపిడ్‌లో కార్ల్​సన్ ప్రపంచ ఛాంపియన్‌ కావడమిది మూడోసారి కాగా.. బ్లిట్జ్‌లో ఏకంగా అయిదోసారి టైటిల్‌ సాధించాడు.

ఇక చెస్‌లో అత్యున్నతమైన క్లాసికల్‌ విభాగంలో అతను నాలుగుసార్లు ఛాంపియన్‌. 2013లో 22 ఏళ్ల వయసులోనే దిగ్గజ క్రీడాకారుడు ఆనంద్‌ను ఓడించి తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌ అయిన అతను.. తర్వాతి నాలుగేళ్లలో మరో మూడు టైటిళ్లు సొంతం చేసుకున్నాడు. మూడు విభాగాల్లో కలిపి 12 ప్రపంచ టైటిళ్లతో తనకు తానే సాటి అనిపిస్తున్నాడు. అంతకంతకూ కార్ల్‌సన్‌ జోరు పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ప్రత్యర్థులు బలహీన పడుతుంటే.. అతనేమో మరింత బలం పుంజుకుంటున్నాడు. కార్ల్‌సన్‌ ఏదైనా టోర్నీలో టైటిల్‌ గెలవకపోతే షాకవుతున్నారు తప్ప.. అతడి ఏ విజయమూ ఆశ్చర్యానికి గురి చేయడం లేదు.

ఒకే సమయంలో క్లాసికల్‌, ర్యాపిడ్‌, బ్లిడ్జ్‌ మూడు విభాగాల్లోనూ ఛాంపియన్‌గా నిలవడం అతడికే చెల్లింది. బాబీ ఫిషర్‌, అనతోలి కార్పోవ్‌, గ్యారీ కాస్పరోవ్‌, విశ్వనాథన్‌ ఆనంద్‌.. ఇలా ఎందరో మేధావుల్ని చూసింది చెస్‌ ప్రపంచం. ఆయా సమయాల్లో వాళ్లను మించిన చెస్‌ ఛాంపియన్లు లేరనిపించి ఉంటుంది అభిమానులకు. కానీ కార్ల్‌సన్‌ వాళ్లందరినీ మించిన వాడని అతడి విజయాలు, గణాంకాలు చాటి చెబుతాయి. ఏ ఛాంపియన్‌తో పోల్చినా.. అతడి ఆట ప్రత్యేకం.. అతడి వ్యూహాలు రహస్యం.. అతడి వ్యక్తిత్వం అనూహ్యం! తొమ్మిదేళ్లకే జాతీయ ఛాంపియన్‌.. 12 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్‌.. 19 ఏళ్లకే ప్రపంచ నంబర్‌వన్‌.. 22 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్‌.. చరిత్రలో ఏ క్రీడాకారుడూ అందుకోని ఎలో రేటింగ్‌.. 12 ప్రపంచ టైటిళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే కార్ల్‌సన్‌ ఘనతలెన్నో!

దేశంలో సగం మంది చెస్‌లోనే..

కార్ల్‌సన్‌ సొంత దేశం నార్వేలో చెస్‌కు ఎప్పట్నుంచో ఆదరణ ఉంది. అయితే దానికి విశేషమైన ఆదరణ తెచ్చి.. ప్రతి కుటుంబంలోనూ చెస్‌ క్రీడాకారులు తయారయ్యేలా చేసిన ఘనత మాత్రం మాగ్నస్‌దే. 55 లక్షల జనాభా ఉండే ఆ దేశంలో సగం మందికి చెస్‌తో పరిచయం ఉందిప్పుడు. ఇప్పుడు దేశంలో ప్రతి పిల్లాడు చెస్‌ ఓనమాలు నేర్చుకుంటున్నాడు. యువతకూ చెస్‌ పిచ్చి పట్టుకుంది. పెద్దవాళ్లూ ఈ ఆటను అనుసరిస్తున్నారు. కార్ల్‌సన్‌ తెచ్చిన ఊపుతో దేశంలో చెస్‌ ఉపకరణాలు అమ్మే దుకాణాలు, చెస్‌ థీమ్స్‌తో బార్లు పెద్ద ఎత్తున ఏర్పాటు కావడం విశేషం.

అతనంతే అదో టైపు

ఆటలోనే కాదు.. బయటా కార్ల్‌సన్‌ విలక్షణం. అతడి తీరు ఎవరికీ అంతుబట్టదు. సాధారణంగా ఓపెనింగ్‌ విషయంలో కొన్ని రకాల శైలిలుంటాయి. ఒక ఎత్తును బట్టి తర్వాతి ఆటనంతటినీ అంచనా వేయొచ్చు. కానీ కార్ల్‌సన్‌ ఈ ఒరవడిని మార్చాడు. ఒక శైలికి కట్టుబడకుండా ఓపెనింగ్‌లో చిత్రమైన ఎత్తులు వేసి.. గేమ్‌లను ఎక్కడెక్కడికో తీసుకెళ్లడం అతడికలవాటు. దీని వల్ల కార్ల్‌సన్‌తో గేమ్‌లకు సన్నద్ధం కావడం ప్రత్యర్థులకు సవాలుగా మారింది. కంప్యూటర్లు కూడా మాగ్నస్‌ ఆటను సరిగా విశ్లేషించలేని స్థితిలో అతడితో మ్యాచ్‌లకు వాటి ప్రాధాన్యం పెద్దగా ఉండట్లేదు.

గతేడాది కరువానాతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సందర్భంగా కార్ల్‌సన్‌ ఆటతీరుపై కొన్ని విమర్శలొచ్చాయి. 12కు 12 గేమ్‌లనూ డ్రా చేసుకున్నాడతను. చివరి గేమ్‌లో విజయావకాశాలు బాగానే ఉన్నప్పటికీ.. 31 ఎత్తుకే అతను డ్రాకు ప్రతిపాదించడాన్ని ఒకప్పటి కార్ల్‌సన్‌ గురువు, దిగ్గజ క్రీడాకారుడు కాస్పరోవ్‌తో పాటు మరో దిగ్గజ క్రీడాకారుడు క్రామ్నిక్‌ కూడా తప్పుబట్టారు. అయితే ర్యాపిడ్‌లో తనకున్న పట్టును దృష్టిలో ఉంచుకుని అతను టైబ్రేక్‌లో అతడి సంగతి చూసుకుందామనుకున్నాడు. అందులో వరుసగా మూడు గేమ్‌లు గెలిచి కరువానాకు చెక్‌ పెట్టేశాడు. ఈ సందర్భంగా 'తమ తెలివి తక్కువ అభిప్రాయాల్ని వెల్లడించే స్వేచ్ఛ కాస్పరోవ్‌, క్రామ్నిక్‌లకు ఉంది' అంటూ కార్ల్‌సన్‌ దిగ్గజాలిద్దరికీ పంచ్‌ విసరడం విశేషం. అందుకే కార్ల్‌సన్‌తో పెట్టుకోవడానికి పెద్ద పెద్ద క్రీడాకారులు కూడా జంకుతారు. ఇక చెస్‌లో ఉన్నంతసేపూ ఎంతగా అందులో నిమగ్నం అవుతాడో.. దాన్నుంచి బయటికి వస్తే మరో మనిషిలా కనిపిస్తాడు కార్ల్‌సన్‌. మిగతా చెస్‌ క్రీడాకారులకు భిన్నంగా దృఢమైన దేహంతో, సిక్స్‌ ప్యాక్‌తో కనిపించడం కార్ల్‌సన్‌కే చెల్లింది. ఫుట్‌బాల్‌, బీచ్‌ వాలీబాల్‌, టెన్నిస్‌, రాక్‌ క్లైంబింగ్‌, స్విమ్మింగ్‌, ఐస్‌ స్కేటింగ్‌, గోల్ఫ్‌.. తీరిక వేళల్లో ఇలా అతనెన్నో ఆటలాడతాడు. పెద్ద టోర్నీల్లో తలపడ్డాక చివరి గేమ్‌ అవ్వగానే వెళ్లి దుస్తులతోనే వెళ్లి స్విమ్మింగ్‌ పూల్‌లో దూకడం.. నేరుగా ఫుట్‌బాల్‌ మైదానంలోకి వెళ్లి ఆ ఆటలో సేదదీరడం కార్ల్‌సన్‌ విలక్షణతను చాటి చెబుతాయి.

ఇదీ చదవండి: 'భారత్​ క్రికెట్​ స్థాయిని పెంచే సత్తా వారిద్దరి​ సొంతం'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: London, UK - 16 January 2014
1. Former US National Basketball Association (NBA) commissioner David Stern speaking at networking event
2. Stern at event, his successor Adam Silver sitting next to him (left of screen)
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Washington DC, US - 28 March 2014
3. Stern speaking at Brookings Institution
4. Stern on stage at event, former Chinese basketball player Yao Ming seated on far right
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Manila, Philippines - 10 October 2013
5. Various of Stern speaking to media
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE - New York, US - 25 October 2012
6. SOUNDBITE (English): David Stern, former NBA commissioner:
"Life is a journey and it's been a spectacular journey."
7. Stern at news conference where he announced he was leaving his position, Silver sitting next to him
STORYLINE:
David Stern, who oversaw the growth of the US National Basketball Association (NBA) into a global power, died on Wednesday, aged 77.
Stern, who spent 30 years as the NBA's longest-serving commissioner, suffered a brain haemorrhage on 12 December and underwent emergency surgery.
The league said he died on New Year's Day, with his wife and their family at his bedside.
Stern had been involved with the NBA for nearly two decades before he became its fourth commissioner on in 1984.
Stern oversaw the birth of seven new franchises and the creation of the WNBA, the NBA's women's equivalent, and the NBA Development League, now the G League, providing countless opportunities to pursue careers playing basketball in the United States that previously weren’t available.
Under Stern, the NBA would play nearly 150 international games and be televised in more than 200 countries and territories, and in more than 40 languages, and the NBA finals and All-Star weekend would grow into international spectacles.
By the time he left his position in 2014, a league that fought for a foothold before him had grown to a more than $5 billion a year industry and made NBA basketball perhaps the world's most popular sport after football.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.