Lionel Messi World Cup Jersey Auction : దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ గదేడాది జరిగిన సాకర్ వరల్డ్‌కప్‌లో అర్జెంటినాను విశ్వవిజేతగా నిలిపాడు. ఏళ్లుగా ఎదురుచూసిన వరల్డ్ కప్ కలను సాకారం చేశాడు. ఈ ప్లేయర్ సాకర్ వరల్డ్ కప్‌లో ధరించిన జెర్సీలను వేలం వేయగా రికార్డు ధర పలికాయి. ఆరు 10వ నంబర్ జెర్సీలను వేలం వేయగా రూ.64.73 ( 7.8 మిలియన్ డాలర్లు) కోట్లు వచ్చాయి. అయితే వేలం ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లల చికిత్స కోసం విరాళంగా ఇవ్వనున్నట్లు మెస్సీ ప్రకటించాడు.
Sothebys Auction House : అర్జెంటినాకు చెందిన సోత్‌బైస్ అనే సంస్థ మెస్సీ వరల్డ్ కప్ జెర్సీలను వేలం వేసింది. న్యూయార్క్‌లోని తమ కార్యాలయంలో సోత్‌బైస్ వీటిని రెండు వారాల పాటు ప్రదర్శనకు ఉంచింది. గురువారం ముగిసిన వేలంలో వాటికి రూ.64 కోట్లు వచ్చాయి. అయితే వాటిని ఎవరు దక్కించుకున్నారన్న విషయం మాత్రం వెల్లడించలేదు. జెర్సీల వేలం ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని సాంట్ జాన్ డె డూ బార్సెలోనా పిల్లల దవాఖాన నిర్వహిస్తున్న యునికాస్ ప్రాజెక్ట్‌కు, లియో మెస్సీ ఫౌండేషన్ ద్వారా డొనేట్ చేయనున్నాడు.
ఆరు జెర్సీలకు రూ.76 కోట్లు కనీస ధరగా సోత్‌బైస్ నిర్ణయించింది. కానీ ఆ స్థాయిలో వేలం జరగలేదు. అయితే ఈ ఏడాది వేలం వేసిన క్రీడా వస్తువుల కన్నా వీటికి ఎక్కువ మొత్తం వచ్చిందని సోత్‌బైస్ సంస్థ తెలిపింది. ఈ టీషర్టులు మైఖెల్ జోర్డాన్ 1998లో ఎన్బీఏ ఫైనల్లో ధరించిన జెర్సీ వేలం రికార్డును బ్రేక్ చేయలేకపోయాయి. గతేడాది న్యూయార్క్‌లో జరిగిన వేలంలో జోర్డాన్ జెర్సీ 10.1 మిలియన్ డాలర్లు సొంతం చేసుకుంది.
36 ఏళ్ల మెస్సీ ప్రస్తుతం మేజర్ లీగ్ సాకర్‌లో మియామీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మెస్సీని ప్రతిష్ఠాత్మక 'బాలన్ డీ ఓర్' (Ballon d'Or) అవార్డు వరించింది. ఇది మెస్సీకి ఎనిమిదో అవార్డు కావడం విశేషం.
BCCI మాస్టర్ ప్లాన్ - IPL తరహాలో టీ10 లీగ్‌కు శ్రీకారం!
మరోసారి దాయాదుల యుద్ధం- టీ20 వరల్డ్‌కప్‌లో భారత్xపాక్ మ్యాచ్ జరిగేది ఇక్కడే!