గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి(Koneru Hampi) చెస్ ప్రపంచకప్ (Chess World Cup)కు దూరం కానుంది. వచ్చే నెల రష్యాలోని సోచిలో జరగబోయే ఈ టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. పురుషులు, మహిళలు కలిపి 300 మందికిపైగా క్రీడాకారులు పాల్గొనే టోర్నీని ఒకే వేదికలో నిర్వహిస్తుండడం వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు హంపి తెలిపింది.
కరోనా కారణంగా జిబ్రాల్టర్‌లో ముగిసిన మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీకి కూడా హంపి దూరమైంది. "ప్రపంచకప్ క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత ఈవెంట్. నేను ఇప్పటికే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించాను. అందుకే ప్రపంచకప్ నుంచి తప్పుకొన్నా" అని హంపి తెలిపింది.
ఇదీ చదవండి: CHESS: 'తగ్గుతున్న చెస్ క్రీడాకారుల కెరీర్ టైమ్'