ETV Bharat / sports

'రెండు నెలల్లో టోర్నీల నిర్వహణ ప్రారంభం కావాలి' - కిరణ్ రిజిజు తాజా వార్తలు

రెండు నెలల్లో టోర్నీలకు ఆతిథ్యమివ్వడానికి భారత్‌ సిద్ధం కావాలని క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. వచ్చే రెండు నెలల్లో కొన్ని టోర్నీలకైనా ఆతిథ్యమివ్వడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు.

కిరణ్
కిరణ్
author img

By

Published : Jun 8, 2020, 7:23 AM IST

కరోనా కారణంగా క్రీడా టోర్నీలన్నీ నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ పునఃప్రారంభం అవుతున్నాయి. భారత్​లో కూడా టోర్నీలు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై స్పందించారు క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు. రెండు నెలల్లో టోర్నీలకు ఆతిథ్యమివ్వడానికి భారత్ సిద్ధం కావాలని తెలిపారు.

"దేశంలో క్రీడా కార్యకలాపాలు వీలైనంత త్వరగా ఆరంభం కావాలని కోరుకుంటున్నా. వచ్చే రెండు నెలల్లో కనీసం కొన్ని టోర్నీలకైనా ఆతిథ్యమివ్వడానికి భారత్‌ సిద్ధంగా ఉండాలి. 2028 ఒలింపిక్స్​లో మనం టాప్‌-10లో ఉండాలి. నేను ఊరికే చెప్పట్లేదు. అందుకోసం సన్నాహం ఇప్పటికే మొదలైంది. 2024లోనూ మనకు మంచి ఫలితాలొస్తాయి. చాలా వేగంగా ఎదుగుతాం. కానీ నా మాటలు గుర్తుపెట్టుకోండి. 2028 ఒలింపిక్స్‌లో భారత్‌ తప్పకుండా టాప్‌-10లో ఉంటుంది. జూనియర్‌ స్థాయి నుంచి అథ్లెట్లకు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నాం."

-కిరణ్ రిజిజు, క్రీడాశాఖ మంత్రి

అయితే అథ్లెట్ల ఆరోగ్యం, క్షేమంగా ఉండడమే అన్నింటికన్నా తమకు ముఖ్యమని రిజిజు స్పష్టం చేశారు. దీర్ఘకాలంలో 2028 ఒలింపిక్సే తమ లక్ష్యమని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.