క్రీడాకారులకు ప్రదానం చేసే రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పురస్కారానికి ఉన్న పేరును మార్చనున్నట్లు వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజల విజ్ఞప్తుల మేరకు.. ఇకపై రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుగా మార్పు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
"ఖేల్‌రత్న అవార్డుకు మేజర్ ధ్యాన్‌చంద్ పేరు పెట్టాలని అనేకమంది నుంచి అభ్యర్ధనలు వస్తున్నాయి. వారి అభిప్రాయాలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ.. ఖేల్‌రత్న పురస్కారానికి మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుగా ఇకపై పిలుస్తారు. జై హింద్!" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.