ETV Bharat / sports

డిస్కస్​ త్రోలో జాతీయ రికార్డుతో ఒలింపిక్స్​కు మరో అథ్లెట్​

టోక్యో ఒలింపిక్స్​-2020కు మరో భారత అథ్లెట్​ అర్హత పొందింది. డిస్కస్ త్రో విభాగంలో కమల్​ప్రీత్ కౌర్ జాతీయ రికార్డు సృష్టించి.. ఈ మెగా టోర్నీలో బెర్తు దక్కించుకుంది.

Kamalpreet Kaur qualifies for Olympics, breaks national record in women's discus throw
డిస్కస్​ త్రోలో​ జాతీయ రికార్డు.. ఒలింపిక్స్​కు మరో అథ్లెట్​
author img

By

Published : Mar 19, 2021, 7:40 PM IST

టోక్యో ఒలింపిక్స్​కు మరో భారత అథ్లెట్​ అర్హత సాధించింది. మహిళల డిస్కస్​ త్రో విభాగంలో కమల్​ప్రీత్​ కౌర్​ ప్రతిష్ఠాత్మక టోర్నీకి క్వాలిఫై అయ్యింది. అథ్లెటిక్స్​ ఫెడరేషన్​ కప్​లో భాగంగా 65.06 మీటర్ల దూరం డిస్కస్​ను విసిరిన కమల్​ప్రీత్​.. జాతీయ రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్​కు అర్హత పొందాలంటే 63.5 మీటర్లు డిస్కస్​ను విసరాల్సి ఉంది.

మహిళల డిస్కస్​ త్రో విభాగంలో 2012లో క్రిష్ణ పూనియా (64.76 మీ.) పేరిట ఉన్న రికార్డు​ను.. తాజాగా కమల్​ప్రీత్​ అధిగమించింది.

కమల్​ప్రీత్​ కౌర్​కు స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్ ఇండియా ట్విట్టర్​ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. "మహిళల డిస్కస్​ త్రోలో సరికొత్త జాతీయ రికార్డుతో టోక్యో ఒలింపిక్స్-2020​కి అర్హత సాధించిన కమల్​ప్రీత్​కు అభినందనలు" అంటూ ట్వీట్ చేసింది.

ఇదీ చదవండి: ఒలింపిక్స్​కు మరో నలుగురు భారత అథ్లెట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.