ETV Bharat / sports

Olympics: ఒలింపిక్స్​ ప్రారంభానికి కొద్దిరోజులే.. కానీ! - ఒలింపిక్స్​

ఒలింపిక్స్‌ నిర్వహణకు దగ్గరపడుతున్న వేళ టోక్యోలో అత్యయిక స్థితి విధించారు. అతిథ్య నగరంలో కేసులు అదుపు చేసేందుకు ఆంక్షలను కఠినతరం చేసింది. విజయోత్సవాలను నిషేధించిన ఆ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. అత్యయిక స్థితి నిర్ణయంతో ఒలింపిక్స్ నిర్వహణ ప్రణాళికలు మారే అవకాశం కనిపిస్తోంది. కేసులు కొనసాగితే విశ్వక్రీడలు రద్దు లేదా ప్రేక్షకులు లేకుండానే క్రీడలు నిర్వహించేందుకు జపాన్ ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది.

Olympics
ఒలింపిక్స్​
author img

By

Published : Jul 8, 2021, 6:37 PM IST

మరో రెండు వారాల్లో టోక్యోలో ఒలింపిక్స్​ జరగనున్న వేళ జపాన్‌ ప్రభుత్వం అత్యయిక స్థితి విధించింది. టోక్యోలో రోజువారి కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల వైరస్‌ వ్యాప్తిని అదుపు చేసేందుకు, మంత్రులు, నిపుణులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు జపాన్‌ ప్రధానమంత్రి యుషిహ్డె సుగా తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎమెర్జెన్సీ ఆదివారంతో పూర్తి కానుండగా ఈ నెల 12 నుంచి ఆగస్టు 22 వరకు కొత్త అత్యయిక స్థితి అమల్లో ఉంటుందని వెల్లడించారు.

ఒలింపిక్స్ క్రీడలు అత్యయిక పరిస్థితుల్లోనే జరగనున్నాయి. విశ్వక్రీడలు ఈ నెల 23న ప్రారంభమై ఆగస్టు 8న ముగియనున్నాయి. బార్లు, రెస్టారెంట్లలలో మధ్యం అమ్మకాలపై నిషేధం విధించిన జపాన్ ప్రభుత్వం.. ఒలింపిక్స్ క్రీడలకు సంబంధించిన ఉత్సవాలకు ప్రజలు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. విజయాలను పురస్కరించుకుని ఎలాంటి పార్టీలు, ఉత్సవాలు జరుపుకోరాదని సూచించింది. టోక్యో వాసులు విశ్వక్రీడలను టీవీల్లో వీక్షించాలని విజ్ఞప్తి చేసింది.

ప్రేక్షకులు లేకుండానే

టోక్యోలో బుధవారం 920 కొవిడ్ కేసులు నమోదవగా, గతవారం ఇదే రోజున 714 కేసులు వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. గత 18 రోజులుగా రోజువారి కేసుల్లో పెరుగుదల నమోదవుతున్నట్లు వివరించారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఒలింపిక్స్‌ హాజరయ్యే విదేశీ ప్రేక్షకులపై జపాన్ ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. రెండువారాల క్రితం ఒలింపిక్స్ క్రీడా వేదికలను 50 శాతం మంది ప్రేక్షకులతో నింపాలని నిర్వాహకులు నిర్ణయించారు. అయితే తాజాగా జపాన్ ప్రభుత్వం తీసుకున్న అత్యయిక స్థితి నిర్ణయంతో.. ఒలింపిక్స్ నిర్వహణ ప్రణాళికలు మారే అవకాశం కనిపిస్తోంది. కేసులు కొనసాగితే విశ్వక్రీడలు రద్దు లేదా.. ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్ నిర్వహించేందుకు జపాన్ ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. జులై 23న జాతీయ మైదానంలో నిర్వహించే ప్రారంభ వేడుకలు కూడా ప్రేక్షకులు లేకుండానే జరగనున్నట్లు సమాచారం.

విస్తృత వ్యాప్తి దశలో

జపాన్‌లో కరోనా వైరస్ విస్తృత వ్యాప్తి దశలో ఉన్నట్లు జపాన్ ప్రభుత్వ ఆరోగ్య సలహాదారు డాక్టర్ షిగెరు ఓమి తెలిపారు. ప్రతి పౌరుడు పరిస్థితుల తీవ్రతను గమనించాలని సూచించారు. బుధవారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో టోక్యోలో పెరుగుతున్న కేసులపై ప్రభుత్వం దగ్గర ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. విశ్వక్రీడలకు ప్రేక్షకులను అనుమతించొద్దని ప్రభుత్వానికి సూచించినట్లు పేర్కొన్నారు.

నిలిపివేసే అవకాశాలు.. లక్షలకోట్ల రూపాయల నష్టం

జపాన్‌లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే విశ్వక్రీడలు అర్ధంతరంగా ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి క్రీడాకారులను రప్పించి.. మధ్యలో ఒలింపిక్స్‌ ఆపేయాల్సి వస్తే జపాన్‌కు, అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘానికి అంతకంటే ఇబ్బందికర పరిస్థితి మరొకటి ఉండదు. దీని వల్ల కలిగే నష్టం కూడా లక్షల కోట్ల రూపాయల్లో ఉండనుంది. దాదాపు 75 శాతం ఆదాయం ప్రసార హక్కుల ద్వారా అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (IOC) ఆర్జిస్తోంది. ఒకవేళ ఒలింపిక్స్ క్రీడలు రద్దయితే దాదాపు 3 బిలియన్ల నుంచి 4 బిలియన్ డాలర్ల వరకు నష్టపోవాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రపంచంలో చాలా దేశాలతో పోలిస్తే కొన్ని నెలల నుంచి జపాన్‌లో కరోనా తక్కువగానే ఉంది. విశ్వక్రీడలకు అతిథ్యం ఇస్తున్న టోక్యో నగరంలో 80 శాతం కంటే ఎక్కువమంది ప్రజలకు టీకాలు వేసినట్లు ఐఓసీ పేర్కొంది. అయితే జపాన్‌లో మొత్తం జనాభాలో 15శాతం జనాభాకు మాత్రమే పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్‌ పూర్తనట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. అందుకే ఒలింపిక్స్‌ సమయంలో నిబంధనలు కఠినతరం చేసి.. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకే ‌అత్యయిక స్థితి విధించినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: Tokyo Olympics: ఒలింపిక్స్​ ప్రారంభోత్సవానికి వీఐపీలు మాత్రమే.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.