ETV Bharat / sports

టోక్యో ఒలింపిక్స్​ నిర్వహణపై నీలినీడలు!

ఈ ఏడాది జపాన్ టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్​ క్రీడలను వాయిదా వేసే అవకాశముందని ఆ దేశ​ ఒలింపిక్​ మంత్రి సీకో హషిమోటో తెలిపారు. 2020లో ఈ టోర్నీ నిర్వహించలేకపోతే దీన్ని రద్దు చేసే అధికారం అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీకి ఉందని గుర్తుచేశారు.

Japan Olympic Minister: Games could be held any time in 2020
టోక్యో ఒలింపిక్స్​ యథావిధిగా జరుగుతుందా..?
author img

By

Published : Mar 3, 2020, 7:26 PM IST

ఈ ఏడాది జపాన్​ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్​ క్రీడలను నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ కారణంగా ఈ పోటీలు వాయిదా పడేలా కనిపిస్తున్నాయి. ఈ విషయంపై పార్లమెంటు ఎగువసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు జపాన్ ఒలింపిక్ మంత్రి సీకో హషిమోటో సమాధానమిచ్చారు. కరోనా (కొవిడ్​-19) కారణంగా ప్రణాళిక ప్రకారం జులై 24 నుంచి ఈ విశ్వటోర్నీ ప్రారంభమయ్యే అవకాశం లేదని తెలిపారు. ఆగస్టు 25 నుంచి పారాలింపిక్స్​ నిర్వహించాలని ఇదివరకే ప్రణాళికలు రూపొందించారు.

ఈ ఏడాది ఒలింపిక్స్​ను నిర్వహించకపోతే దాన్ని రద్దు చేసే హక్కు అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ(ఐఓసీ)కి ఉందని ఆమె అన్నారు. అయితే 2020లో ఎప్పటివరకైనా ఈ టోర్నీని వాయిదా వేసే అవకాశాలూ ఉన్నాయని తెలిపారు. అయితే మరోవైపు యథావిధిగా ఈ టోర్నీ జరుగుతుందని ఐఓసీ అధ్యక్షుడు థామస్​ బాచ్ ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేశారు. ​

ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ వల్ల జపాన్​లో 12 మంది మరణించారు. ఈ క్రమంలో ఆ దేశంలోని పాఠశాలలు, క్రీడలను నిలిపివేశారు. చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ కనీసం 70 దేశాలకు పాకినట్టు తాజా సర్వేలు తెలుపుతున్నాయి. ఇప్పటివరకు 90,000 కేసులు నమోదవ్వగా, 3,100 మరణాలు సంభవించాయి.

ఇదీ చూడండి.. టీ20 ప్రపంచకప్‌ : సెమీఫైనల్స్​లో తలపడే జట్లివే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.