టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics)లో పాల్గొనేందుకు వచ్చే అథ్లెట్ల కోసం రీసైక్లింగ్‌కు వీలుండే కార్డ్‌బోర్డ్‌తో తయారు చేసిన బెడ్లను ఉపయోగించనున్నారు. అయితే కరోనా కారణంగా ఒలింపిక్స్‌లో శృంగారం కట్టడికి నిర్వాహకులు ఈ విధంగా చర్యలు చేపట్టారని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ రూమర్లపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(IOC) స్పందించింది. ఒలింపిక్ గ్రామంలో క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన బెడ్లు మన్నిక కలిగినవని ఐఓసీ భరోసా ఇస్తూ సోమవారం ఓ ప్రకటన చేసింది.
మరోవైపు ఒలింపిక్ గ్రామంలో ఏర్పాటు చేసిన పడకలు మన్నికగా లేవనే వార్తలను ఐర్లాండ్‌కు చెందిన జిమ్నాస్టిక్ ఆటగాడు రైస్ మెక్‌క్లెనాఘన్ కొట్టిపారేశాడు. తనకు కేటాయించిన బెడ్‌పై జంప్ చేస్తున్న వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు.
-
“Anti-sex” beds at the Olympics pic.twitter.com/2jnFm6mKcB
— Rhys Mcclenaghan (@McClenaghanRhys) July 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">“Anti-sex” beds at the Olympics pic.twitter.com/2jnFm6mKcB
— Rhys Mcclenaghan (@McClenaghanRhys) July 18, 2021“Anti-sex” beds at the Olympics pic.twitter.com/2jnFm6mKcB
— Rhys Mcclenaghan (@McClenaghanRhys) July 18, 2021
"ఇవి యాంటీ సెక్స్ పడకలు అన్నది అవాస్తవం. ఇదొక ఫేక్ న్యూస్.. ఫేక్ న్యూస్.."- మెక్‌క్లెనాఘన్, ఐర్లాండ్ జిమ్నాస్టిక్
ఈ ట్వీట్‌పై స్పందించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(IOC) ఐర్లాండ్ జిమ్నాస్టిక్ క్రీడాకారుడు మెక్క్లెనాఘన్కు ధన్యవాదాలు తెలిపింది. ఒలింపిక్ గ్రామంలో ఏర్పాటు చేసిన పడకల గురించి వచ్చిన రూమర్లను కొట్టివేసినందుకు ఐఓసీ హర్షం వ్యక్తం చేసింది.
జులై 23 నుంచి ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్‌లో 33 క్రీడల కోసం 42 వేదికలు.. 339 పతకాలను సిద్ధం చేసింది జపాన్ ప్రభుత్వం. ఈ మెగాఈవెంట్లో దాదాపుగా 11,500 క్రీడాకారులు పాల్గొననుండగా.. అందులో 51 శాతం పురుషులు 49 శాతం మహిళలు ఉన్నారు.
ఇదీ చూడండి.. Tokyo Olympics: ఒలింపిక్స్‌కు ముందు పెరుగుతున్న కరోనా కేసులు