ETV Bharat / sports

ఒలింపిక్స్​లో పాల్గొనే క్రీడాకారులకు కరోనా టీకా

టోక్యో, బీజింగ్​ ఒలింపిక్స్​లలో పాల్గొనే అథ్లెట్లకు కరోనా టీకా వేసేందుకు.. అంతర్జాతీయ ఒలింపిక్స్​ కమిటీ (ఐఓసీ), చైనా కలిసి గురువారం ఓ అవగాహనకు వచ్చాయి. విశ్వక్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు రెండు కంటే ఎక్కువ డోసులు అవసరమైతే వాక్సినేషన్​కు అయ్యే ఖర్చునూ ఐఓసీ భరిస్తుందని థామస్​బాచ్​ అన్నారు.

IOC and China make vaccine deal for Tokyo Olympics, Beijing Winter Games bound athletes
ఒలింపిక్స్​లో పాల్గొనే క్రీడాకారులకు కరోనా టీకా
author img

By

Published : Mar 11, 2021, 9:53 PM IST

త్వరలో జరగబోయే టోక్యో, బీజింగ్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు కరోనా టీకా వేసేందుకు.. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ), చైనాలు ఓ అవగాహనకు వచ్చాయి. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఐఓసీ ప్రకటించింది.

చైనా ప్రతిపాదనను స్వాగతించిన ఐఓసీ.. నిజమైన క్రీడా స్ఫూర్తికి నిదర్శనమని ఐఓసీ అధ్యక్షుడు థామస్‌బాచ్‌ పేర్కొన్నారు. ఒలింపిక్స్‌, పారా ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు రెండు కంటే ఎక్కువ డోసులు అవసరమైతే అందుకయ్యే వ్యయాన్ని ఐఓసీ భరిస్తుందన్నారు.

జులై 23 నుంచి టోక్యో ఒలింపిక్స్‌, 2022 ఫిబ్రవరిలో శీతాకాల ఒలింపిక్స్‌ క్రీడలు బీజింగ్‌లో జరగనున్నాయి.

ఇదీ చూడండి: టోక్యో ఒలింపిక్స్​: విదేశీ క్రీడాభిమానులకు నో ఎంట్రీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.