ETV Bharat / sports

'అమ్మాయికి బాక్సింగ్ ఎందుకన్నారు.. ఇప్పుడు జేజేలు కొడుతున్నారు' - boxing news latest

Nikhat Zareen Interview: ప్రపంచ ఛాంపియన్​గా అవతరించి సంచలనం సృష్టించింది తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్. ఒలింపిక్స్​లో భారత్​కు పతకం తేవడమే తన లక్ష్యమంటోంది. అయితే బాక్సర్ కావాలని కలలుకన్న నిఖత్ ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. ఆమె విజయంలో తండ్రిదే కీలకపాత్ర. చిన్ననాటి నుంచి నిఖత్ బాక్సింగ్ జర్నీపై ఆమె తండ్రి మాటల్లో..

Nikhat Zareen
ఈ అమ్మాయికి బాక్సింగ్ ఎందుకు అన్నవాళ్లే ఇప్పుడు జేజేలు కొడుతున్నారు
author img

By

Published : May 24, 2022, 5:40 PM IST

Nikhat Zareen: 'నాన్నా.. బాక్సింగ్ రింగ్​లో అబ్బాయిల మాత్రమే ఎందుకున్నారు?' తెలంగాణ నిజామాబాద్ జిల్లాలోని కలెక్టర్​ స్టోర్ట్స్​ గ్రౌండ్​లో ఒకప్పుడు నిఖత్ జరీన్ తన తండ్రి మహమ్మద్ జమీల్​ అహ్మద్​ను అడిగిన ప్రశ్న ఇది. అందుకు ఆయన బదులిస్తూ.. ఈ ఆటకు చాలా కఠినంగా శ్రమించాలి. శక్తి కావాలి అని చెప్పారు. అమ్మాయిలు బాక్సింగ్ చేయలేరా? అని నిఖత్ మరో ప్రశ్న అడిగింది. అందుకు తండ్రి మరోసారి సమాధానం చెబుతూ.. మహిళలు పురుషులకు విధేయులని అందరూ భావిస్తుంటారు, ఇలాంటి ఆటలో రాణించలేరు అని అనుకుంటారని చెప్పారు. దీన్ని ఓ సవాల్​గా తీసుకుంది నిఖత్. సరదాగా గడిపేందుకు గ్రౌండ్​కు వెళ్లిన ఆమె.. ఎలాగైనా బాక్సర్​ కావాలని దృఢంగా నిశ్చయించుకుంది. చివరకు కలను సాకారం చేసుకుని ప్రపంచ ఛాంపియన్​షిప్​లో పసిడి కైవసం చేసుకుంది. మహిళలు శక్తిమంతులు కారని భావించే ప్రపంచంలో, అమ్మాయిలు నిక్కర్లు, టీషర్టులు వేసుకోవడం ఏంటని ప్రశ్నించే సమాజంలో నిఖత్ ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. ఎన్నో కష్టాలను, సవాళ్లను ఎదుర్కొని దేశం గర్వించే స్థాయికి చేరుకుంది. నిఖత్ ప్రయాణం ఎలా సాగిందో ఆమె తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్ మాటల్లో..

Nikhat Zareen
ఈ అమ్మాయికి బాక్సింగ్ ఎందుకు అన్నవాళ్లే ఇప్పుడు జేజేలు కొడుతున్నారు

నిఖత్​కు బాక్సింగ్ పట్ల ఆసక్తి ఉందని మీకు ఎప్పుడు తెలిసింది?
వేసవి సెలవుల్లో ఓసారి నిఖత్​ను కలెక్టర్ స్పోర్ట్స్ గ్రౌండ్​కు తీసుకెళ్లా. అక్కడకు వచ్చే పిల్లలతో సరదాగా కాలక్షేపం చేస్తుందని అనుకున్నా. అక్కడికి వెళ్లాక ఏదైనా క్రీడ పట్ల ఆసక్తి ఉన్నట్లు చెప్తే అందులోనే శిక్షణ ఇప్పించాలకున్నా. ఆ తర్వాత రోజూ గ్రౌండ్​కు తీసుకెళ్లా. ఆమెకు క్రీడల్లో రాణించే సత్తా ఉందని అర్థమైంది. మొదట్లో అథ్లెటిక్స్​లో 100మీటర్లు, 200 మీటర్లలో శిక్షణ తీసుకుంది. 4-5 నెలల పాటు సాధన చేసింది. ఆ తర్వాత గ్రౌండ్​లో కొంతమంది బాక్సర్లను చూసింది. నాన్నా.. బాక్సింగ్​ చాలా ఇంట్రెస్టింగ్ గేమ్​.. కానీ అబ్బాయిలు మాత్రమే ఆడుతున్నారు, అమ్మాయిలు ఎందుకు ఆడటం లేదని ప్రశ్నించింది. అందుకు కఠోర శ్రమ, శక్తి కావాలని నేను చెప్పా. అప్పటి నుంచి ఆమె బాక్సర్ కావాలనుకుంది. అప్పుడే తన ప్రయాణం మొదలైంది.

కుమార్తెలను క్రీడల్లోకి తీసుకురావడం తల్లిదండ్రలకు కష్టతరమైన సమాజంలో మనం జీవిస్తున్నాం. బయటి నుంచి కూడా ఎన్నో ప్రతికూలతలు ఉంటాయి. వీటన్నింటినీ ఎలా అధిగమించారు?
నేను కూడా ఓ క్రీడాకారుడ్ని. నిఖత్​కు బాక్సింగ్ పట్ల ఆసక్తి ఉందని నాకు అర్థమయ్యాక తనకు శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టా. తను కూడా బాగా ఉత్సాహంగా ఉంది. కానీ కొంత మంది తనకు బాక్సింగ్​ ఎందుకు? వేరే ఆట ఏదైనా నేర్పించవచ్చు కదా అని చెప్పారు. నా వెనకాల విమర్శలు గుప్పించారు. నా స్నేహితులను కూడా నిఖత్​కు​ బాక్సింగ్ ఎందుకు నేర్పిస్తున్నారు అని అడిగేవారు. బాక్సింగ్ నిఖత్ ఇష్ట ప్రకారం ఎంచుకున్న క్రీడ అని చెప్పా. మిగతాది ఆ దేవుడే చూసుకుంటాడన్నా. వాళ్ల మాటల్ని నేను అసలు పట్టించుకోలేదు. విశాఖపట్నంలో ఇండియన్ బాక్సింగ్​ శిక్షణ క్యాంప్​కు నిఖత్ ఎంపికయ్యింది. జాతీయ స్థాయికి చేరేవరకు నిఖత్​ నిక్కర్లు, టీషర్టులు వేసుకోవడమేంటని మాట్లాడేవారు. కానీ నేను వాటిని వినిపించుకోలేదు. కొన్నిసార్లు మనం ఓపికగా ఉండాలి. ఇప్పుడు నిఖత్ ప్రపంచ ఛాంపియన్. అప్పుడు నిఖత్​ గురించి రకరకాలు మాట్లాడిన వాళ్లే ఇప్పుడు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. మొత్తం మారిపోయింది. నిఖత్​ను చూడాలని ఉందని, ఓసారి కలుస్తామని అడుగుతున్నారు.

ఇటీవల కాలంలో కుమార్తెల కెరీర్​ను తండ్రులు తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేకించి క్రీడారంగంలో. పీవీ సింధు, సైనా నెహ్వాల్, ఇప్పుడు నిఖత్. మన దేశంలో కూతుర్లు, తండ్రులకు మీరిచ్చే సందేశం ఏంటి?
దేశంలో ఎంతోమంది టాలెంటెడ్ ప్లేయర్లు వెలుగులోకి వస్తున్నారు. ఓ స్టోర్ట్స్​ పర్సన్​కు తండ్రిగా ఉండటం భారత్​లో సులభం కాదు. ఇతరుల మాటలు పట్టించుకోకుండా మీ కుమార్తెలు ఏం చేయాలనుకుంటే అది చేయనివ్వండి. వారికి మద్దతుగా నిలవండి. క్రీడలు వారిని శక్తిమంతం చేయడమే గాక, జీవితంలో ముందుకు తీసుకెళ్తాయి.

ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తన భవిష్యత్ కార్యాచరణ గురించి వివరించారు.

ప్రపంచ ఛాంపియన్​షిప్ గెలిచిన ఐదో భారత బాక్సర్ మీరు. ఈ ఘనత సాధించడం మీకు ఎలా ఉంది?
ఇది నాకు ఎంతో ప్రత్యేకం. చాలాకాలం తర్వాత నేను వరల్డ్ ఛాంపియన్​షిప్​లో పసిడి పతకం గెలిచాను. ఇది నా ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. కామన్​వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్, పారిస్ ఒలింపిక్స్​ పోటీల్లో రాణించేందుకు మరింత ఉత్సాహాన్నిస్తుంది.

మీరు గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నారు. గాయాల బారిన పడ్డారు. కరోనా సమయంలో ప్రపంచం విపత్కర పరిస్థితిని చూసింది. మీ కష్టం మిమ్మల్ని ఎంతలా ప్రేరేపించింది?
నా ప్రయాణం ఓ రోలర్ కోస్టర్​. ఎన్నో ఒడుదొడుకులు ఉన్నాయి. కానీ ఎప్పుడు నేను ఆత్మవిశ్వాసంతోనే ఉన్నా. నన్ను నేను నమ్మా. ఏదో ఒక రోజు ప్రపంచ ఛాంపియన్​షిప్​లో పతకం సాధించి కలను సాకారం చేసుకుంటా అనుకున్నా. గాయాల తర్వాత నా జీవితంలో చాలా జరిగాయి. కానీ అవి నన్ను మరింత దృఢంగా మార్చాయి. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్​షిప్​ గెలిచా. నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, చేసిన త్యాగాలకు గోల్డ్ మెడల్​తో తగిన ఫలితం దక్కింది.

వరల్డ్ ఛాంపియన్​షిప్​కు మీరు ఎలా సన్నద్ధమయ్యారు?
చాలా బాగా సాధన చేశా. ఈ కాంపిటీషన్​ కోసం కఠోరంగా శ్రమించా. ఎలాగైనా పతకం గెలవాలనుకున్నా. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నా. టోక్సో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్​ను ఓడించాక నా విశ్వాసం రెట్టింపు అయింది. ఇంకా ఎక్కువ శ్రమించా. విభిన్న బాక్సర్లతో పోటీ పడటం నాకు కలిసొచ్చింది.

మీ జీవిత లక్ష్యం ఏంటి?
ఒలింపిక్స్​లో భారత్​కు పతకం తేవాలన్నదే నా జీవిత ఆశయం. నా దృష్టంతా పారిస్​ ఒలింపిక్స్​పైనే. అయితే ప్రస్తుతానికి కామన్​వెల్త్ గేమ్స్​ కోసం ప్రిపేర్ అవుతున్నా. అంతకంటే ముందు ట్రయల్స్​లో పాల్గొని ఎంపిక కావాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: ఉమ్రాన్ కోసం తండ్రి త్యాగం.. కష్టాలకు దూరం చేసి.. కలను సాకారం చేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.