ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ ముంగిట భారత రెజ్లర్లు సాక్షి-సోనమ్ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. విజయం మాత్రం సోనమ్‌నే వరించింది. బుధవారం జరిగిన ట్రయల్స్‌లో ఈమె చేతిలో వరుసగా రెండోసారి ఓడిపోయింది ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్. ఈ ఏడాది జనవరిలోనూ సోనమ్ చేతిలోనే సాక్షికి పరాభవం ఎదురైంది.
ఈరోజు జరిగిన బౌట్లో సాక్షిపై ఆధిపత్యం ప్రదర్శించిన సోనమ్... వచ్చే నెల 27-29 తేదీల మధ్య జరగనున్న ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ పోటీలకు అర్హత సాధించింది.
18 ఏళ్ల సోనమ్.. ఇటీవల జరిగిన ఆసియా ఛాంపియన్షిప్, రోమ్ ర్యాంకింగ్ సిరీస్‌లో బరిలోకి దిగినా, పతకం తెచ్చుకోలేకపోయింది. అందుకే సాక్షితో 65 కేజీల విభాగంలో మళ్లీ ట్రయల్స్ నిర్వహించారు. ఈ పోరుకు ముందు ఆసియా ఛాంపియన్, 59 కేజీల విభాగంలో పసిడి గెలిచిన సరితపై గెలిచి ఫైనల్‌కు చేరింది సోనమ్.
ఇటీవల సాక్షికి కాంస్యం
ఇటీవల జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్(65కేజీలు) రజతాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్‌కు సులభంగానే చేరుకున్న సాక్షి... తుదిపోరులో 0-2తేడాతో నవోమీ రూకే(జపాన్) చేతిలో ఓడిపోయింది.